ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @5PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @5PM
author img

By

Published : Apr 16, 2021, 5:03 PM IST

1.పవన్​కల్యాణ్​కు కరోనా పాజిటివ్​

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కరోనా నిర్ధారణైంది. హైదరాబాద్‌ వ్యవసాయ క్షేత్రంలో పవన్​ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యాన్ని అపోలో ఆస్పత్రి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.కొవిడ్​ ఆస్పత్రిగా గాంధీ..

రేపటి నుంచి పూర్తిస్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా గాంధీలో సేవలు అందనున్నాయి. గాంధీని పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఓపీ సేవలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.నో లాక్​డౌన్​

సెకండ్ వేవ్ కరోనా వేగంగా వ్యాపిస్తున్నందున.. మహమ్మారి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని చెప్పారు. రాష్ట్రంలో లాక్​డౌన్, కర్ఫ్యూ పెట్టే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.'ఆక్సిజన్​ ఉత్పత్తిని పెంచాలి'

దేశంలో సరిపడా మెడికల్ ఆక్సిజన్​ సరఫరా కోసం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆక్సిజన్​ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.'అందుకే పౌరసత్వం ఇవ్వడం లేదు'

బంగాల్​లో మతువా, నామసూద్ర వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రంలో చొరబాట్లను ఆపగలిగేది భాజపానేనని స్పష్టంచేశారు. నాడియా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షా.. కాంగ్రెస్, లెఫ్ట్​ పార్టీలపైనా ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.'కరోనా ఉద్ధృతి కలవరపెడుతోంది'

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కలవరపెడుతోందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) డైరెక్టర్ టెడ్రోస్ అథనోమ్. గత రెండు నెలల నుంచి కేసులు రెండింతలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కరోనాను సమర్థంగా కట్టడి చేసిన దేశాల్లో.. ప్రస్తుతం అధికంగా కేసులు నమోదవుతున్నాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.వారాంతంలో స్వల్ప లాభాలు

వరుసగా మూడో సెషన్​లోనూ స్టాక్ మార్కెట్లు లాభాలను గడించాయి. సెన్సెక్స్ స్వల్పంగా 28 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 14,600 మార్క్ దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర శుక్రవారం రూ.46,431 వద్దకు చేరింది. వెండి ధర కిలో రూ.53 ఎగిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.'అశ్విన్​కు మరో ఓవర్ ఇవ్వాల్సింది'

రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ ఆఖరి ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో దిల్లీ స్పిన్నర్ అశ్విన్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. కానీ ఇతడిని మూడు ఓవర్లకే పరిమితం చేశారు. దీంతో యాష్​కో మరో ఓవర్ ఇవ్వకపోవడం పొరపాటేనని అంగీకరించాడు దిల్లీ కోచ్ రికీ పాంటింగ్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.'99 సాంగ్స్​' సమీక్ష

ఆస్కార్ విజేత ఎ.ఆర్‌.రెహమాన్. ఆయ‌న పేరు చెప్ప‌గానే మొద‌ట గుర్తుకొచ్చేది సంగీత‌మే. అయితే రెహమాన్‌లో కేవ‌లం సంగీత ద‌ర్శ‌కుడే కాదు, మంచి క‌థకుడు కూడా ఉన్నారు. ఆయ‌న క‌థ‌తోనే ‘99 సాంగ్స్‌’ చిత్రం రూపొందింది. తెలుగుతో పాటు ప‌లు భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం ఎలా ఉంది? అసలు కథేంటి? అనే విషయాలు ఈటీవీ భారత్ సమీక్ష ద్వారా తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.