ELECTRIC BIKE: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు చెలరేగాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని మెంటేవారి తోట రైల్వేగేట్ సమీపంలో ఓ ఎలక్ట్రిక్ బైక్ అగ్నికి ఆహుతైంది. భీమవరానికి చెందిన మేడిశెట్టి ఆదినారాయణ.. ఎలక్ట్రికల్ బైక్‌పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనం ఆగిపోయింది. ఆ తర్వాత పొగలు వచ్చాయి. అప్రమత్తమైన ఆదినారాయణ ద్విచక్రవాహనాన్ని రహదారిపైనే వదిలేసి దూరంగా వెళ్లిపోయారు. కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి. ఎలక్ట్రికల్ బైక్ మొత్తం కాలి బూడిదైంది.
ఇవీ చదవండి: శ్రీకృష్ణ జన్మస్థలంలో మసీదును తొలగించాలని పిటిషన్.. కోర్టు ఏమందంటే?