ETV Bharat / city

Telangana Local Body Election 2022 : స్థానిక సంస్థల్లో 5 వేలకు పైగా ఖాళీలు - తెలంగాణ స్థానిక సంస్థల్లో ఖాళీలు

Telangana Local Body Election 2022 : తెలంగాణ స్థానిక సంస్థల్లో 5వేలకు పైగా పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రజాప్రతినిధుల రాజీనామాలు, ఆకస్మిక మరణాలు సహా వివిధ కారణాలతో ఈ పదవులు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. ఎన్నికల సంఘం సమాచారమిచ్చినా.. రాష్ట్ర సర్కార్ తేదీలకు ఆమోదం తెలపడం లేదని సమాచారం.

Vacancies in Telangana Local Bodies
Vacancies in Telangana Local Bodies
author img

By

Published : Jan 3, 2022, 8:40 AM IST

Telangana Local Body Election 2022 : రాష్ట్రంలో అయిదు వేలకు పైగా స్థానిక సంస్థల పదవులు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రంలో 2018, 2019 సంవత్సరాల్లో గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌లకు ఎన్నికలు జరిగాయి. ప్రజాప్రతినిధుల రాజీనామాలు, ఆకస్మిక మరణాలు సహా వివిధ కారణాలతో వాటిలో అనేకం ఖాళీలు ఏర్పడ్డాయి. వీటి గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సమాచారమిచ్చింది. అయితే ఎన్నికల తేదీలకు సర్కార్‌ ఇంకా ఆమోదం తెలపకపోవడంతో జాప్యం జరుగుతోందని సమాచారం.

ఏడాదికిపైగా ఖాళీ..

Telangana Local Body Election for Vacancies : ఆదిలాబాద్‌ గ్రామీణ మండల జడ్పీటీసీ సభ్యుడు రాజన్న జడ్పీ వైస్‌ ఛైర్మన్‌గా ఉండేవారు. ఆయన 2020 సెప్టెంబరు లో మృతి చెందారు. 14 నెలలుగా జడ్పీటీసీ స్థానం ఖాళీగా ఉంది. పలు ఇతర స్థానాలు ఏడాదిన్నరకు పైగా ఖాళీగా ఉన్నాయి. వార్డు సభ్యుల ఎన్నికలు జరగక పలుచోట్ల సర్పంచులు, ఉపసర్పంచుల స్థానాలకు ఎన్నికలు జరగలేదు. ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు లేనిచోట మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల ఎన్నికలపై ప్రభావం పడింది.

ఖాళీగా ఉన్న స్థానాలివే..

Vacancies in Telangana Local Bodies : రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సిన స్థానాలు వేలకు పైగా ఉన్నాయి. వాటిలో 5వేల 67 వార్డు సభ్యులు, 190 సర్పంచులు, 105 ఎంపీటీసీ స్థానాలు, 1 జడ్పీటీసీ స్థానం, 2 జడ్పీ వైస్​ ఛైర్మన్ స్థానం, 100కు పైగా ఉపసర్పంచుల స్థానాలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.