kedareshwar Temple: ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం లభించే అతి ప్రాచీనమైన శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయంలో మహాదేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ దేవాలయం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఉంది. మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా.. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి.. స్వామివారికి అభిషేకాలు చేశారు.
ఆలయ చరిత్ర
తూర్పు చాళుక్యుల కాలంలో బిక్కవోలు గ్రామంలోని గోలింగేశ్వర స్వామి గ్రామంలోని నలుదిక్కుల నాలుగు శివాలయాలు నిర్మించారు. వాటిలో ఒకటైన జైన దేవాలయంలో కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు. అప్పుడు జరిగిన యుద్ధాలలో ఈ ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడంతో ఆలయం మూతపడింది. తిరిగి ఆలయాన్ని తెరిచి సంవత్సరానికి ఒక రోజు మాత్రమే, అదీ మహా శివరాత్రి పర్వదినాన మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా వేకువజాము నుంచే స్వామివారిని దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం కిటకిటలాడుతోంది.
ఇదీచూడండి: ఆ గ్రామంలో శివుడి మహిమ.. దర్శనమిచ్చిన నాగన్న.. వీడియో వైరల్..