earthquake hit Indonesia: బుధవారం తెల్లవారుజామున 4:25 గంటలకు ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంప కేంద్రం మలుకు.. బరత్ దయా జిల్లాకు ఈశాన్యంగా 86 కి.మీ దూరంలో... సముద్రగర్భం కింద 131 కి.మీ లోతులో ఏర్పడింది.
దీని ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం లేకపోవడంతే అక్కడి ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. రాత్రి సమయంలో భూకంపం రావడంతో ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
ఇదీ చూడండి: ప్రపంచంలోనే అతిపెద్ద మెరుపు.. 770 కిలోమీటర్ల మేర వ్యాప్తి