ETV Bharat / city

Earthquake fear at chittoor: రెండురోజులుగా భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు - చిత్తూరు జిల్లా

Earthquake fear at chittoor: ఏపీలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలందరూ ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. రెండ్రోజులుగా భారీ శబ్ధాలకు జనం బెంబేలెత్తున్నారు.

Earthquake fear at chittoor
చిత్తూరులో భూ ప్రకంపనలు
author img

By

Published : Dec 2, 2021, 4:21 PM IST

Earthquake fear at chittoor: ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు స్థానికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. బైరెడ్డిపల్లె మండలం కౌండిన్య అభయారణ్యం సరిహద్దులోని తిమ్మయ్యగారిపల్లె, నల్లగుట్లపల్లె, ఓటేరుపాళ్యం, రఘునాయకులదిన్నె గ్రామాల్లో రెండ్రోజులుగా భూమి కంపిస్తోంది. భూ ప్రకంపనల కారణంగా వస్తున్న భారీ శబ్దాలకు జనం హడలిపోతున్నారు. ఇళ్లు కూలిపోతాయేమోననే భయంతో చాలామంది వీధుల్లోకి పరుగులుతీశారు.

తిమ్మయ్యగారిపల్లెలో స్థానికులు ఊరికి సమీపంలోని బండపైకి చేరుకుని టార్పాలిన్‌ పట్టలతో గుడారాలు వేసుకున్నారు. తహసీల్దార్‌ సీతారాం, ఎంపీడీవో రాజేంద్రబాలాజీ, ఎస్సై మునిస్వామి.. గ్రామాల్లో పర్యటించారు. భూమి పొరల్లోకి నీరు చేరడంతో శబ్దాలు వచ్చి ఉండవచ్చని వారు తెలిపారు.

ఇదీ చదవండి: CP Stephen Ravindra: దేశంలోనే అతిపెద్ద సైబర్‌ మోసాన్ని ఛేదించాం: సీపీ స్టీఫెన్ రవీంద్ర

DH on Omicron : ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉంది... తస్మాత్ జాగ్రత్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.