ETV Bharat / city

జలుబు తగ్గకపోతే నిర్లక్ష్యం చేయొద్దు: డా. కనుమూరి - ఇంట్లో కరోనాకు చికిత్స వార్తలు

కరోనా వైరస్‌ సామాజికంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో సాధారణ జలుబు వచ్చి... ఒకటి రెండు రోజులకు తగ్గకపోతే నిర్లక్ష్యం చేయవద్దని ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్. కనుమూరి బసవ శంకరరావు అన్నారు. హోం క్వారంటైన్‌ ద్వారా వైద్యం అందించే విధానంపై ఆయన 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

doctor sanker rao
రెండు, మూడు రోజుల్లో జలుబు తగ్గకపోతే.. నిర్లక్ష్యం చేయొద్దు: డా. కనుమూరి
author img

By

Published : Aug 5, 2020, 8:15 PM IST

స్వాబ్‌ పరీక్షలో నెగిటివ్‌ వచ్చినా, సిటీ స్కాన్‌ పరీక్షలో పాజిటివ్‌ లక్షణాలు వస్తోన్న కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ కనుమూరి బసవ శంకరరావు అన్నారు. 60 ఏళ్లు వయసు దాటి, కరోనా సోకిన వారిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకపోయినా.. లివర్‌, క్రియాటిన్‌ పరీక్షల్లో తేడాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రిలో చేరడం మేలని సూచించారు.

వ్యాధి తీవ్రత ఆధారంగా ఇంట్లోనే ఉండి ఎప్పటి కప్పుడు ఆరోగ్య స్థితిగతులను బేరీజు వేసుకొని వైద్యం పొందవచ్చని సూచించారు. విజయవాడలో సుమారు 200 మందికిపైగా కొవిడ్‌ బాధితులకు హోం క్వారంటైన్‌ ద్వారా వైద్యం అందించినట్టు శంకరరావు 'ఈటీవీ భారత్'తో మాట్లాడిన సందర్భంగా వివరించారు.

రెండు, మూడు రోజుల్లో జలుబు తగ్గకపోతే.. నిర్లక్ష్యం చేయొద్దు: డా. కనుమూరి

ఇవీచూడండి: ప్రజల ఆరోగ్యాలను ప్రభుత్వం గాలికొదిలేసింది: భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.