ఆరోగ్యశ్రీ జాబితాలోని జబ్బులకు సీఎం సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్) అర్జీలు తీసుకోవద్దని ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 2,434 జబ్బులకు చికిత్స చేస్తున్నామని పేర్కొంది. వచ్చే నెల 1 నుంచి ఇలాంటి క్లెయింలు సీఎంఆర్‌ఎఫ్ కింద స్వీకరించబోమని సీఎంవో స్పష్టం చేసింది.
ఇవీచూడండి: బల్దియా పోరు: ఇక ప్రచార పర్వం