ETV Bharat / city

ఆ బాలిక భవితకు దాతల భరోసా - బీడీఎల్‌ విన్నర్స్‌ ఫౌండేషన్‌

ఆటోలో వెళ్తుండగా దారిలో ట్రాక్టర్‌ ట్రాలీలోని బండరాయి మీద పడటంతో తీవ్రంగా గాయపడి చదువుకు దూరమైన విద్యార్థిని వైద్యానికి దాతలు చేయూతనందిస్తున్నారు. వారి నుంచి బాధితురాలికి రూ.లక్షన్నర అందాయి. శ్రీలక్ష్మి విద్య, వైద్యానికి సంబంధించిన ఖర్చులన్నీ భరిస్తామని బీడీఎల్‌ విన్నర్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు రఘు అరికెపూడి ముందుకొచ్చారు.

Mother with injured student
Mother with injured student
author img

By

Published : May 3, 2022, 10:04 AM IST

ఆటోలో వెళ్తుండగా దారిలో ట్రాక్టర్‌ ట్రాలీలోని బండరాయి మీద పడటంతో తీవ్రంగా గాయపడి చదువుకు దూరమైన విద్యార్థిని కటకం శ్రీలక్ష్మి వైద్యానికి భరోసా ఇవ్వడానికి దాతలు ముందుకు వస్తున్నారు. బాలిక దయనీయ స్థితిపై ‘చదువుకు దూరమై..భవిత ఛిద్రమై’ శీర్షికన ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ ప్రధాన సంచికలో సోమవారం ప్రచురితమైన కథనం చూసి పలువురు చలించిపోయారు. వారి నుంచి బాధితురాలికి రూ.లక్షన్నర అందాయి. శ్రీలక్ష్మి విద్య, వైద్యానికి సంబంధించిన ఖర్చులన్నీ భరిస్తామని బీడీఎల్‌ విన్నర్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు రఘు అరికెపూడి ముందుకొచ్చారు.

ఆరు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరకులు, వైద్యానికి సంబంధించిన పరికరాలను కొరియర్‌ ద్వారా పంపించారు. తల్లి హరితకు స్వయం ఉపాధి కోసం కుట్టుమిషన్‌ అందిస్తామని తెలిపారు. మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారులు వీల్‌ చైర్‌ అందించారు. ఈ సందర్భంగా తమ దైన్యతను వెలుగులోకి తెచ్చి సహకరించిన ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు శ్రీలక్ష్మి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

అసలేం జరిగిందంటే..

బాధితురాలు

ఖమ్మం గ్రామీణ మండలం వెంకటగిరి ఇందిరమ్మ కాలనీ-2లో నివాసముంటున్న రమేశ్‌, హరిత దంపతుల కూతురు శ్రీలక్ష్మి రెండేళ్ల క్రితం తొమ్మిదో తరగతి చదువుతోంది. ఒకరోజు ఆటోలో తల్లిదండ్రులతో కలసి వెళ్తుండగా గ్రానైట్‌ రాళ్లతో వెళ్తున్న ట్రాక్టర్‌లోని బండరాయి ఒకటి జారి.. శ్రీలక్ష్మిపై పడింది. దీంతో ఆమె కాలు, చేయి ఛిద్రమయ్యాయి. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అయిదు నెలలు చికిత్స పొందింది. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించగా రూ.4.5 లక్షలు ఖర్చయింది. ప్రస్తుతం కోలుకుంటున్నా మంచానికే పరిమితమైంది. తాము కూడబెట్టినదంతా వైద్యానికి ఖర్చయిందని.. మందులు, వైద్యానికి నెలకు రూ.5 వేలు ఖర్చు అవుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

తండ్రి రమేశ్‌ ప్రస్తుతం పెయింటింగ్‌ పనిచేస్తున్నాడు. కూతురి బాగోగులు చూసుకునేందుకు తల్లి హరిత కుట్టుపని మానేసింది. శ్రీలక్ష్మి కాలు, చేయి, నడుముకు ఆరు రాడ్లు వేశారని, వాటిని తీయించడానికి చేతిలో చిల్లిగవ్వ లేదని వారు తెలిపారు. గాయాలకు ప్రతిరోజు డ్రెస్సింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక భారంతో ఆసుపత్రిలో చేయించే పరిస్థితి లేక పాత దుస్తులనే గాయాలకు చుడుతున్నారు. ఒక్కగానొక్క కుమార్తె పరిస్థితి చూసి నిరుపేద తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. దాతలు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఆర్థిక సాయం అందించాలనుకునే వారు శ్రీలక్ష్మి తండ్రి రమేశ్‌ను (ఫోన్‌ నంబర్‌ 7660084930) సంప్రదించవచ్చు.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.