కష్టకాలంలో పేదల ఆకలి తీర్చడమే తమ సంస్థ లక్ష్యమని సర్వ్ నీడీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు గౌతమ్ తెలిపారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ ధ్యాన గణపతి దేవాలయ ఆవరణలో పేద బ్రాహ్మణులు, అర్చకులు, పురోహితులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటించే వారి వివరాలను తమకు తెలియగానే వారికి అవసరమైన నిత్యావసర సరకులను పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.