ETV Bharat / city

Minister Jagadish Reddy : 'తలసరి విద్యుత్ వినియోగంలో ఐదో స్థానంలో తెలంగాణ' - తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి

దేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి(Telangana Power Minister Jagadish Reddy) తెలిపారు. విద్యుత్ వృద్ధిరేటులో మాత్రం రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందని వెల్లడించారు. దేశంలో సంపూర్ణ విద్యుద్ధీకరణ జరిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందని స్పష్టం చేశారు.

Minister Jagadish Reddy
Minister Jagadish Reddy
author img

By

Published : Oct 5, 2021, 11:13 AM IST

తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఉన్న విద్యుత్‌ సమస్యను మూడు నెలల్లో పరిష్కరించినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి(Telangana Power Minister Jagadish Reddy) తెలిపారు. మూడేళ్లలోనే రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందించినట్లు శాసనసభలో వివరించారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలో ఐదో స్థానంలో రాష్ట్రం నిలిచిందని స్పష్టం చేశారు. విద్యుత్‌ రంగంలో రాష్ట్ర పురోభివృద్ధికి కేసీఆర్‌ దార్శనికతే కారణమని మంత్రి జగదీశ్‌ రెడ్డి(Telangana Power Minister Jagadish Reddy) వెల్లడించారు. రాష్ట్రంలో తలసరి విద్యుత్​ వినియోగం ఎంత? తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ ఏ స్థానంలో ఉంది? రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్​ను తీర్చడానికి తీసుకుంటున్న చర్యలేవని అసెంబ్లీలో పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి(Telangana Power Minister Jagadish Reddy) సమాధానమిచ్చారు.

రాష్ట్రం ఏర్పడే నాటికి ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ సమస్యలు ఎదుర్కొన్నామని మంత్రి(Telangana Power Minister Jagadish Reddy) తెలిపారు. కానీ ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో.. ఆ సమస్యలను త్వరగానే అధిగమించామని అన్నారు. రాష్ట్రంలో ట్రాన్స్మిషన్ వ్యవస్థను బలోపేతం చేసుకుని 17వేల మెగావాట్ల విద్యుత్​కు డిమాండ్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన కరెంట్​ను అందించే స్థాయికి ఎదిగామని స్పష్టం చేశారు. డిస్కంల ద్వారా 990.. 33కేబీ సబ్​స్టేషన్లు ఏర్పాటు చేసి.. 16వేల 48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని తెలంగాణలో విద్యుత్ సరఫరా సమస్యలేకుండా విజయం సాధించామని వివరించారు.

రాష్ట్రంలో రెండు డిస్కంల ద్వారా కోటి 65 లక్షల కనెక్షన్లు ఇచ్చామని మంత్రి జగదీశ్(Telangana Power Minister Jagadish Reddy) తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి కోటి 11 లక్షలు ఉన్న ఈ కనెక్షన్లు ఏడేళ్లలో 54 లక్షలు పెరిగాయని చెప్పారు. తెలంగాణ సాధించుకునే సమయానికి 19 లక్షలు మాత్రమే ఉన్న వ్యవసాయ కనెక్షన్లు రాష్ట్రం వచ్చిన తర్వా 25.63 లక్షల వరకు పెరిగాయని వెల్లడించారు. మరో లక్ష కనెక్షన్లు ప్రస్తుతం పెండింగ్​లో ఉన్నాయని.. కరోనా వల్ల పోల్స్ తయారీ, ఇతర మెటీరియల్స్ ఉత్పత్తి ఆగిపోవడం వల్ల పెండింగ్​ పడ్డాయని అన్నారు.

"రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం.. జెన్​కో ద్వారా 4,325 మెగావాట్లు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత థర్మల్​లో 2,570 మెగావాట్లు, సెంట్రల్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా 771 మెగావాట్లు, ఇతర పద్ధతుల ద్వారా 3415 మెగావాట్లు, పవన విద్యుత్ ద్వారా 128 మెగావాట్లు, ఇతర పునరుత్పాదక వనరుల ద్వారా 26 మెగావాట్లు, ఇతర రాష్ట్రాల సెక్టార్ల ద్వారా 2200 మెగావాట్లు ఉంది. లాంగ్​టర్మ్​ పీపీల ద్వారా 9600 మెగావాట్లు అదనంగా చేర్చడం ద్వారా మూడేళ్లలో అందరికి 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్​కు విద్యుత్ రంగంపై ఉన్న పట్టు, అవగాహన, రైతులపై ఉన్న మక్కువ వల్లే తక్కువ సమయంలో ఇది జరిగింది. రాష్ట్రం ఏర్పడే ముందు అనేక సభల్లో కేసీఆర్.. రాష్ట్రం రాగానే 24 గంటల విద్యుత్ సరఫరా ఇవ్వలేము కనీసం మూడేళ్లు సమయం పడుతుందని చెప్పారు. చెప్పినట్లే చేసి చూపించారు."

- జగదీశ్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి

తెలంగాణ వ్యాప్తంగా ప్రతి తండా, ప్రతి గ్రామం, మండలం, జిల్లాలో విద్యుత్ సరఫరా ఉందని మంత్రి(Telangana Power Minister Jagadish Reddy) అన్నారు. దేశంలోనే పూర్తిస్థాయి విద్యుద్దీకరణ జరిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.