తెలంగాణలో కరోనా వ్యాప్తి(corona virus) తగ్గుముఖం పట్టింది. మూడో ముప్పు(covid third wave) పొంచి ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ శ్రీనివాస రావు(telangana DH srinivas rao) సూచించారు. ప్రజలంతా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు.
కరోనా టీకా(corona vaccine) తీసుకోని వారికి రేషన్, పింఛన్ నిలిపివేస్తామని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పు అని డీహెచ్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రజలు అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. తప్పుడు వార్తను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడో ముప్పు దగ్గర్లోనే ఉందని.. అందరు మాస్కులు తప్పక ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.