DGP launched Website: రాబోయే రోజుల్లో ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఒక వెబ్సైట్ ఏర్పాటు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీస్ అధికారులు వెబ్సైట్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేస్తూ.. ప్రజలకు ఉపయోగపడే విధంగా చూడాలని డీజీపీ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. కాజీపేట్ నిట్ కళాశాలలోని బోస్ సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వెబ్సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ఆన్లైన్ విధానంలో ప్రారంభించారు.
వరంగల్ కమిషనరేట్ వెబ్సైట్లో పొందుపర్చిన అంశాలను సీపీ తరుణ్ జోషి డీజీపీకి వివరించారు. ప్రజలకు జిల్లా చరిత్రతో పాటు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పనితీరు, ప్రజలకు అవసరమైన పోలీస్స్టేషన్లతోపాటు పోలీస్ అధికారుల పూర్తి సమాచారం తెలుసుకునే విధంగా వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు తరుణ్ జోషి వివరించారు. ఈ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయడం, నమోదైన ఎఫ్ఐఆర్ పరిశీలించడంతో పాటు వాటిని ప్రింట్ తీసుకునే సౌలభ్యం కూడా ఉన్నట్లు తరుణ్ జోషి వివరించారు. నూతనంగా దరఖాస్తు చేసుకున్న పాస్‌పోర్ట్ స్టేటస్ తెలుసుకోవడంతో పాటు... ప్రజలు నేరాలబారిన పడకుండా అవగాహన కల్పించే విధంగా వెబ్సైట్లో పలు అంశాలు పొందుపర్చినట్టు వివరించారు.
ఇదీ చూడండి: