ETV Bharat / city

చరిత్రాత్మక తీర్పునకు తిరుపతి వేదిక కావాలి: చంద్రబాబు - ఏపీ తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​లో ఆలయాలపై దాడులు, దుష్ప్రచారం వెనక రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చేసిన వ్యాఖ్యలపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విధ్వంసాలు చేసిన వైకాపా నేతలపై కేసులు ఎందుకు లేవని నిలదీశారు.

dgp-acting-under-the-direction-of-jagan-reddy-chandra-babu-criticized
సజ్జల కథనం.. జగన్ రెడ్డి దర్శకత్వంలో డీజీపీ నటన: చంద్రబాబు
author img

By

Published : Jan 16, 2021, 9:53 PM IST

ఆంధ్రప్రదేశ్​లో దేవాలయాలపై దాడులు చేసిన వారిని వదిలేసి... ఘటనల గురించి చెప్పిన వారిపైనే కేసులు నమోదు చేస్తారా? అని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విధ్వంసాలు చేసిన వైకాపా నేతలపై కేసులు ఎందుకు లేవని నిలదీశారు. అన్యమత ప్రచారాలు, బలవంతపు మత మార్పిళ్లు చేస్తుంది ఏవరని ప్రశ్నించారు. సజ్జల కథనం, జగన్ రెడ్డి దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. తిరుపతి పార్లమెంట్ నేతలతో ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆలయాలపై 150 దాడులు, విగ్రహాల ధ్వంసాలు జరిగేదాకా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. ఆ ఘటనలకు రాజకీయాలకు సంబంధం లేదని... ఉన్మాదుల పనేనని భోగి రోజున డీజీపీ చెప్పారు. మళ్లీ కనుమ రోజున మాట మార్చి ప్రతిపక్షాలకు అంటగడుతున్నారు. వైకాపా దుర్మార్గాలపై ప్రజా తీర్పునకు తిరుపతి ఉప ఎన్నిక తొలి పరీక్ష కావాలి. వైకాపా అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలకు ఇదొక అవకాశం. అధికార పార్టీని ఓడించడం ద్వారా చరిత్రాత్మకమైన తీర్పునకు తిరుపతి వేదిక కావాలి. దేశానికే ఒక సందేశాన్ని తిరుపతి వాసులు పంపాలి.

- చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి : గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి 200 రుణ యాప్‌ల తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.