సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో మంచి నీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కరించామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ తెలిపారు. సీతాఫల్మండిలోని బీదల బస్తీలో రూ.40లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న కొత్త మంచి నీటి పైప్లైన్ పనులను ఆయన ప్రారంభించారు. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా సివరేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు.
నీటి సరఫరాను మెరుగు పరిచేందుకు కేవలం ఐదేళ్ల వ్యవధిలో మారేడుపల్లి, తార్నాక, శాంతినగర్ రిజర్వాయర్లను కొత్తగా నిర్మించామని వెల్లడించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీచూడండి: 'హైదరాబాద్లో 2050 వరకు తాగునీటికి ఏ కొరతా ఉండదు'