తెలంగాణ, ఏపీల నుంచి వచ్చే ప్రయాణికులపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. 14 రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేస్తూ.. దిల్లీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వైరస్‌లో మార్పులు వచ్చినట్లు కనుగొన్నందున ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
'విమానాలు, రైళ్లు, బస్సులు, కార్లు , ట్రక్కులతోపాటు ఇతర ఏ రవాణా మార్గంలో వచ్చినా క్వారంటైన్లో ఉండాలి. అందకుయ్యే ఖర్చును వారే భరించాలి. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నా.. ప్రయాణానికి 72 గంటల ముందు పరీక్ష చేయించుకున్న తర్వాత నెగెటివ్ వచ్చినా.. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను చూపిన వారు వారం రోజులపాటు హోం క్వారెంటైన్లో ఉండాలి' అని తెలిపింది. రాజ్యాంగ పదవుల్లో ఉండి ఇక్కడికి వచ్చి వెళ్లే వారు. వారి సిబ్బందికి కరోనా లక్షణాలు లేకపోతే ఈ షరతుల నుంచి మినహాయింపునిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండి: ఆక్సిజన్, రెమ్‌డెసివర్, టీకా డోసులను ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి