ETV Bharat / city

తోడ బుట్టారు... మరణంలోనూ తోడుగానే వెళ్లారు - DEATH OF BROTHERS IN CHANDRAGIRI MANDAL, CHITTHOR DISTRICT ANDHRA PRADESH

ఎప్పుడూ అన్యోన్యంగా, ఆప్యాయంగా ఉండే ఆ అన్నదమ్ములు ఒకే రోజు మృతి చెందారు. తమ్ముడికి గుండెపోటు వచ్చి మరణించగా.. ఆ వార్త విన్న అన్న గుండె హఠాత్తుగా ఆగిపోయింది. అన్నదమ్ముల మృతితో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.

మరణంలోనూ వీడని రక్త సంబంధం... అన్నదమ్ములు మృతి

author img

By

Published : Apr 12, 2020, 8:23 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లిలో విషాదం నెలకొంది. గుండెపోటుతో తమ్ముడు మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న అన్న తన ప్రాణాలొదిలాడు. గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్‌ బాబు (50)... వెంకటరామయ్య (47) ఇద్దరూ అన్నదమ్ములు. సుబ్రహ్మణ్యం గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాడు. తమ్ముడు వెంకటరామయ్య తిరుపతిలో ఎల్​ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ స్వగ్రామం వచ్చి పొలం పనులు చూసుకునేవాడు.

ఒకరి వెంట మరొకరు...

ఈ క్రమంలో స్వగ్రామానికి చేరుకొన్న వెంకట్రామయ్య... ఉదయం పొలం పనులకు వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చాడు. ఆ వెంటనే గుండెల్లో నొప్పిగా ఉందంటూ కుప్పకూలిపోయాడు. స్పందించిన స్థానికులు 108 వాహనంలో హుటాహుటిన తిరుపతికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సొదరుడి మరణ వార్త విన్న అన్న సుబ్రమణ్యం... హఠాత్తుగా కుప్పకూలాడు. అనంతరం పరీక్షించగా ప్రాణాలు కోల్పోయాడు. ఓకేసారి అన్నదమ్ములిద్దరి మరణం గ్రామంలో విషాదఛాయలు నింపాయి.

ఇవీ చూడండి : సౌదీలో గుండెపోటు... కామారెడ్డి జిల్లాలో విషాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.