Dangerous Fish in seawater: సముద్ర జలాల్లో లభ్యమయ్యే కొన్ని చేపలు ప్రమాదకరంగా ఉంటాయి. మత్స్యకారులు వేట సాగించే సమయంలో అప్రమత్తంగా లేకుంటే ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి. కొమ్ము కోనెం మాత్రమే కాకుండా టేకు, కత్తి కొమ్ముకోనాం, నెమలిపురి, సొర చేపలు కూడా ప్రమాదకరమైనవని మత్స్యకారులు తెలిపారు. ఇవి ఎక్కువగా సముద్ర గర్భంలో ఉంటాయి. అప్పుడప్పుడు తీరానికి ఆరేడు నాటికల్ మైళ్ల దూరానికి వస్తుంటాయి. వాటిని పట్టుకోవడానికి మత్స్యకారులు చిన్న, పెద్ద కన్ను, చతురస్రాకార, డైమండ్ వలలు, గేలాలు వినియోగిస్తారు. వాటి నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో కొన్ని ఎదురుదాడులకు దిగుతాయని మత్స్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ చేపలు.. యమ డేంజర్..
టేకు చేప
టేకు చేప: దీనిపై ఎలక్ట్రిక్ రే ఉంటుంది. దీనిలో విద్యుత్తు తరంగాలు ప్రసరిస్తాయి. ఈ చేపలు కొన్ని సార్లు బయటకు వస్తాయి. 30 నుంచి 40 కిలో బరువు ఉంటుంది. వలలో చిక్కిన తర్వాత జాగ్రత్తగా బోటు లోపలికి లాగాలి. ఎలక్ట్రిక్ రే గుచ్చుకోకుండా చూసుకోవాలి. స్టింగ్ అనేది చేప పైభాగంలో ఉంటుంది. అందులో విషపూరిత పదార్థ.ం ఉంటుంది. అది తగిలినా ప్రమాదమే.
కొమ్ము కోనెం
● కొమ్ము కోనెం: పెద్ద కన్నుల వలలు, గేలంతో వీటి వేట సాగిస్తున్నారు. గేలానికి పడిన వాటిని పైకి లాగిన సమయంలో దాడికి ప్రయత్నం చేస్తాయి. సూది మాదిరిగా ఉండే దాని కొమ్ము తల, పొట్ట, గుండెపై తగలడానికి అవకాశం ఉంటుంది. వీటి బరువు 20 కిలోల నుంచి వంద కిలోల ఉంటుంది.
కత్తి కొమ్ముకోనెం..
సొరచేప..
నెమలిపురి కోనెం..
విషపాములూ ఉంటాయి..
మరపడవలు, ఇంజిను పడవలపై వేటకు వెళ్లే మత్స్యకారులు వలలను లాగే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదకరమైన చేపలే కాకుండా ఎన్‌హైడ్రీనా, హైడ్రోఫిష్ వంటి విష పాములు ఉంటాయి. వలలు లాగే సమయంలో ఇవి కూడా వచ్చే అవకాశం ఉంది. గ్లౌజులు, గమ్‌బూట్లు వంటివి మత్స్యకారులు ధరించాలి. ఇటీవల కొమ్ము కోనాం దాడిలో మృతి చెందిన మత్స్యకారుడి కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
- పి.లక్ష్మణరావు, మత్స్యశాఖ జేడీ
ఇదీచూడండి: సముద్రంలో మునిగిన వ్యక్తికి కరోనా టెస్టులు- 41రోజుల్లో 28సార్లు పాజిటివ్!