రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. నిత్యం వివిధ శాఖలతో ఎడతెరపిలేని సమీక్షలతో ఎప్పుడు బిజీగా ఉండే ఆయన.. ఇవాళ కొంచం నలతకు గురయ్యారు. అనుమానం వచ్చిన సీఎస్... కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆయన అనుమానమే నిజమైంది. కరోనా పాజిటివ్‌గా తేలింది.
కరోనా లక్షణాలు పూర్తి స్థాయిలో లేనప్పటికీ... పాజిటివ్‌గా నిర్దారణ కావడం వల్ల రోజువారీ కార్యకలాపాలకు కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆయనతో కలిసిన వారిలో ఎవరికైనా... కొవిడ్ లక్షణాలు ఉన్నట్లయితే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.