Asani Cyclone Effect on AP : తుపాను ప్రభావంతో ఏపీలోని కోనసీమ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో లక్షా 91 వేల ఎకరాల్లో రైతులు రబీ వరి సాగు చేశారు. ఇప్పటివరకు 82 వేల ఎకరాల్లో మాత్రమే వరి కోతలు పూర్తయ్యాయి. కోతలు పూర్తయిన పంటలకు సంబంధించి 40 శాతానికిపైగా ధాన్యం తుపాను కారణంగా రాశుల్లోనే ఉండిపోయింది. ఈదురుగాలులతో వరిచేలు నేల వాలాయి. వాతావరణం ఇలాగే ఉంటే ధాన్యం మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Asani Cyclone Effect on Crops in AP : తిరుపతి జిల్లా నాయుడుపేట పరిసరాల్లో రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కూరగాయలు, ఉద్యానవన పంటలు దెబ్బతింటున్నాయి. వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తుండటంతో చెట్లు నేలకూలాయి. పంటలు దెబ్బతిన్నాయి. పంటలకు వేసిన షెడ్డులు పడిపోయాయి. పందిళ్లు నేలవాలాయి. ఇటుకల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.
కృష్ణాజిల్లా : దివిసీమలో అసని తుపాను ప్రభావంతో భారీగా వీస్తున్నాయి. మోపిదేవి, చల్లపల్లి, మండలాల్లో అరటి తోటలు, మునగ తోటలు, బొప్పాయి తోటలు నేలకొరిగాయి. మామిడి కాయలు రాలిపోవడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ గాలులకు రోడ్లపై తాడి చెట్లు, వృక్షాలు విరిగి పడ్డాయి. వర్షం తక్కువగా ఉన్నప్పటికీ గాలుల ప్రభావంతో రైతులకు నష్టం వాటిల్లింది.
ప్రకాశం జిల్లా : చీరాల మండలంలో వేరుశెనగ పంట నీటమునిగింది. రొయ్యల చెరువులు కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
- ఇదీ చదవండి : తెలంగాణపై అసని ఎఫెక్ట్.. అక్కడ భారీ వర్షాలు