సామాన్యులపై పెనుభారం మోపుతూ... గత ప్రభుత్వాల కారణంగా ధరలు పెరుగుతున్నాయని ప్రధాని మాట్లాడటం సరైంది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ... ఆ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఆందోళన చేపట్టారు.
ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ తాళ్లతో ఆటో లాగుతూ సీపీఐ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ప్రజల బతుకుల్లో చీకట్లు నింపుతున్నాయని చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రతి వస్తువును జీఎస్టీలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం.... పెట్రోల్, డీజిల్‌ను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించకపోతే అన్నిపక్షాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు
ఇదీ చదవండి: ఎంబీబీఎస్ చదివినా ఉద్యోగం రాలేదని... ఆత్మహత్య!