నిర్మలాసీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్... కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాసేదిగా ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా విమర్శించారు. ప్రధాని మోదీ కార్పొరేట్ హౌస్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మక్దూం భవన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన... లాక్డౌన్ తర్వాత ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజలను నిరుత్సాహపరిచిందని ఆక్షేపించారు. దిల్లీలో కొనసాగుతున్న రైతుల నిరసనకు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు.
వ్యవసాయాన్ని, రైల్వేను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో జరిగే సీపీఐ జాతీయ మహాసభలను విజయవాడలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మతతత్వ శక్తులపై పోరాడేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. తెలంగాణలో భాజపా గందరగోళం సృష్టించాలని చూస్తోందని... దాడులు-ప్రతిదాడులు మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలకు రీ-నోటిఫికేషన్ ఇచ్చి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని ఆ రాష్ట్ర కార్యదక్ళి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఇది సామాన్యుడికి అండగా నిలిచే బడ్జెట్: ప్రధాని