ETV Bharat / city

ఉల్లంఘనులపై ఉక్కుపాదం.. రాచకొండలో 25 వేలకు పైగా కేసులు

హైదరాబాద్​ కుషాయిగూడ పోలీస్​స్టేషన్ పరిధిలోని ఈసీఐఎల్ తనిఖీ కేంద్రాన్ని సీపీ మహేశ్​భగవత్ పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటివరకు 25 వేలకు పైగా కేసులు నమోదైనట్టు సీపీ తెలిపారు. అందరూ లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని సూచించారు.

cp mahesh bhagwat visited kushaiguda police check post

author img

By

Published : May 21, 2021, 6:11 PM IST

రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండో దశ లాక్​డౌన్ విధించిన మొదటి రోజు నుంచి నేటి వరకు 25 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. కుషాయిగూడ పోలీస్​స్టేషన్ పరిధిలోని ఈసీఐఎల్ తనిఖీ కేంద్రాన్ని మహేశ్​భగవత్ పరిశీలించారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.

అనుమతి లేకుండా బయటకు వచ్చినా, మాస్కు ధరించకపోయినా, భౌతిక ధూరం పాటించకపోయినా కేసులు నమోదు చేస్తున్నట్లు మహేశ్​భగవత్ తెలిపారు. ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూ... పోలీసులకు సహకరించాలని సూచించారు.

ఇదీ చూడండి: జూన్ 1న మార్కెట్లోకి కోటి 'కొవిసెల్ఫ్​' టెస్ట్​ కిట్​లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.