ETV Bharat / city

'ఏటీఎం కేంద్రాల్లో సరైన భద్రత ఏర్పాట్లు చేసుకోవాలి' - సీపీ‌ మహేశ్​‌ భగవత్‌ తాజా

వరుస ఏటీఎం దొంగతనాల నేపథ్యంలో బ్యాంకులన్నీ ఆయా ఏటీఎం కేంద్రాల్లో సరైన భద్రత ఏర్పాట్లు చేసుకోవాలని సీపీ మహేశ్​‌ భగవత్‌ సూచించారు. లేకపోతే బ్యాంకులకు నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. అలారం విధానం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.

cp mahesh bhagavath on atm security
'ఏటీఎం కేంద్రాల్లో సరైన భద్రత ఏర్పాట్లు చేసుకోవాలి'
author img

By

Published : Dec 18, 2020, 7:51 PM IST

ఏటీఎంలలో వరుస చోరీల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్​‌ భగవత్‌ తెలిపారు. వరుస దొంగతనాల నేపథ్యంలో బ్యాంకులు.. ఆయా ఏటీఎం కేంద్రాల్లో సరైన భద్రత ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. కొన్ని ఏటీఎం కేంద్రాల్లో భద్రత లేకపోవడాన్ని గుర్తించి దొంగలు వాటిని లక్ష్యంగా చేసుకుంటున్నట్టు చెప్పారు.

ప్రధానంగా అలారం విధానం ఏర్పాటు తప్పనిసరని భగవత్‌ గుర్తు చేశారు. ఇప్పటికే పలుమార్లు బ్యాంకుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి పటిష్ఠ భద్రతపై పలు సూచనలు చేసినట్టు వివరించారు. సరైన ఏర్పాట్లు చేసుకోని బ్యాంకులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. హర్యానా రాష్ట్రానికి చెందిన నేరగాళ్లు ఏటీఎం చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించామని భగవత్‌ చెప్పారు.

ఇదీ చూడండి: ఆదిలాబాద్‌ తాటిగూడ కాలనీలో కాల్పుల కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.