ETV Bharat / city

Corona vaccination : శరవేగంగా టీకా పంపిణీ.. మూణ్నెళ్లలోగా వందశాతం మందికి తొలిడోసు

author img

By

Published : Sep 7, 2021, 12:14 PM IST

Updated : Sep 7, 2021, 12:34 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్(Corona vaccination) ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. వచ్చేమూడు నెలల్లో తెలంగాణలో వందశాతం మందికి కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే జీహెచ్​ఎంసీలో ఏర్పాటు చేసిన ఇంటింటి వ్యాక్సినేషన్ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రత్యేక కథనం.

తెలంగాణలో శరవేగంగా టీకా పంపిణీ
తెలంగాణలో శరవేగంగా టీకా పంపిణీ

కరోనా మహమ్మారి(Corona vaccination)ని... సమర్థంగా నిలువరించే సామర్థ్యం కేవలం టీకా(Corona vaccination)కు మాత్రమే ఉందన్న వైద్యులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు తెలంగాణలో.. జనవరిలో ప్రారంభమైన టీకాల పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,86,15,553 డోసుల టీకాలను పంపిణీ చేశారు. అధికారిక లెక్కల ప్రకారం 1,37,20,941 మందికి ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ అందగా... అందులో 48,94,612 మందికి రెండు డోసులు పూర్తైనట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

1500 కేంద్రాల ద్వారా..

నిత్యం దాదాపు 1500లకు పైగా కేంద్రాల ద్వారా టీకా(Corona vaccination)ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో హెల్త్ కేర్ వర్కర్లు 3,04,006 మంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు 3,16,782 మంది, 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారు 70,69,800 మంది, 45 ఏళ్లు పై బడిన వారు 60,30,353 మంది ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. టీకా డోసుల్లో 1,53,26,549 డోసులు ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లోనే పంపిణీ చేయగా.... మరో 32,89,004 డోసులు ప్రైవేటు ఆస్పత్రుల వారు అందించారు.

ఇంటింటికి టీకా..

వచ్చే రెండు మూడు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా వందశాతం మందికి కనీసం ఒకడోస్ వ్యాక్సిన్(Corona vaccination) ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నిత్యం సుమారు రెండు లక్షల మందికి టీకాలు అందిస్తున్నారు. ఇప్పటికే బల్దియా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా జీహెచ్​ఎంసీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి టీకాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వ్యాక్సినేషన్ పూర్తైన ఇళ్లకు స్టిక్కర్లు అంటించటంతో పాటు.. పూర్తి స్థాయిలో టీకాలు తీసుకున్న కాలనీలను గుర్తించి ఇంకా వ్యాక్సినేషన్ పూర్తి కాని ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి టీకా తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ సత్ఫలితాలను ఇస్తున్నందున.. ఇతర మున్సిపాలిటీలు, చిన్న చిన్న పట్టణాల్లోనూ ఇదే ప్రణాళికతో ముందుకు వెళ్లాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. భవిష్యత్తుల్లో గ్రామాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది.

మూణ్నెళ్లలో వందశాతం ఫలితాలు..

దాదాపు ఎనిమిది నెలలుగా నిర్విరామంగా టీకా(Corona vaccination)లు అందించే ప్రక్రియలో నిమగ్నమైన వైద్య ఆరోగ్య శాఖ....టీకా తీసుకున్న కొందరికి వైరస్ సోకినా వ్యాధి తీవ్రం కావటం లేదని గుర్తించింది. వచ్చే రెండు మూడు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా వందశాతం మందికి కనీసం తొలి డోస్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

Last Updated : Sep 7, 2021, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.