ETV Bharat / city

Covaxin Booster Dose : బూస్టర్‌ డోసుగా కొవాగ్జిన్‌కు జపాన్‌ గుర్తింపు

Covaxin Booster Dose : కొవాగ్జిన్ వ్యాక్సిన్​కు మరో అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ టీకాను ప్రయాణికులు బూస్టర్ డోస్​గా తీసుకోవడానికి జపాన్ దేశం అనుమతించినట్లు తెలిపింది. ఫైజర్‌, మొడెర్నా, నొవావ్యాక్స్‌, ఆస్ట్రజెనెకా, జాన్సన్‌ కంపెనీలకు చెందిన కొవిడ్‌ టీకాలకు కొంతకాలంగా జపాన్‌లో ఇటువంటి అనుమతి ఉంది. తాజాగా ఈ జాబితాలో భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ను చేర్చింది.

Covaxin Booster Dose
Covaxin Booster Dose
author img

By

Published : Aug 6, 2022, 6:47 AM IST

Covaxin Booster Dose : కొవాగ్జిన్‌ టీకాకు మరొక అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ టీకాను ప్రయాణికులు బూస్టర్‌ డోసుగా తీసుకోవడానికి జపాన్‌ అనుమతించిందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఫైజర్‌, మొడెర్నా, నొవావ్యాక్స్‌, ఆస్ట్రజెనెకా, జాన్సన్‌ కంపెనీలకు చెందిన కొవిడ్‌ టీకాలకు కొంతకాలంగా జపాన్‌లో ఇటువంటి అనుమతి ఉంది. తాజాగా ఈ జాబితాలో భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ను చేర్చింది. బూస్టర్‌ డోసుగా కొవాగ్జిన్‌ టీకాను తీసుకున్న ప్రయాణికులను జులై 31 నుంచి అనుమతిస్తున్నట్లు జపాన్‌ ప్రభుత్వ ఆరోగ్య,కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తద్వారా భారత్‌ బయోటెక్‌ పలు బహుళజాతి ఫార్మా కంపెనీల సరసన చేరినట్లవుతోంది.

Covaxin Booster Dose in Japan : ‘కొవాగ్జిన్‌’ టీకా బూస్టర్‌ డోసుతో రోగ నిరోధక శక్తి పెరుగుతోందని ఇటీవలే భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. ఈ విషయాన్ని ‘నేచర్‌’ సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌లో ప్రచురించినట్లు పేర్కొంది. 'కొవాగ్జిన్‌ టీకా బూస్టర్‌ డోసు ప్రయోగాలను 184 మంది వాలంటీర్లపై నిర్వహించారు. రెండు డోసుల టీకా తీసుకున్న ఆరు నెలల తర్వాత వారికి బూస్టర్‌ డోసు ఇచ్చారు. ఇందులో సగం మందికి నిజమైన టీకా, మిగిలిన వారికి ‘ప్లాసిబో’ ఇచ్చి ఫలితాలను విశ్లేషించారు. బైండింగ్‌ యాంటీబాడీస్‌ ఉత్పత్తి, ఆర్‌బీడీ, ఎన్‌-ప్రొటీన్‌, మెమొరీ టీ-సెల్‌, బీ-సెల్‌ రెస్పాన్స్‌.. తదితర అంశాలను పరిశీలించామని.' భారత్ బయోటెక్ తెలిపింది.

Covaxin Vaccine For Corona : కొవిడ్‌ వైరస్‌- ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్‌, ఒమిక్రాన్‌ వేరియంట్లను ఈ టీకా సమర్థంగా ఎదుర్కొన్నట్లు తేలింది. టీకా తీసుకున్న కొంతకాలానికి యాంటీబాడీల సంఖ్య తగ్గినప్పటికీ, టీ-సెల్‌ రెస్పాన్స్‌ మాత్రం 12 నెలల పాటు కనిపించినట్లు భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. దీనివల్ల దీర్ఘకాలం పాటు బి-సెల్‌ మెమొరీ కూడా సాధ్యపడుతోందని వివరించింది. తొలి రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో ఆరు నెలల తర్వాత రోగ నిరోధక శక్తి తగ్గుతోందని.. కానీ, బూస్టర్‌ డోసు తీసుకుంటే అనూహ్యంగా పెరుగుతోందని వెల్లడించింది. అదే సమయంలో ఎటువంటి ‘సైడ్‌ ఎఫెక్ట్స్‌’ లేవని స్పష్టం చేసింది.

Covaxin Vaccine by Bharat Biotech : మరోవైపు.. కొవాగ్జిన్ టీకా పిల్లల్లో అత్యంత సమర్థంగా పనిచేస్తుందని.. ఇటీవల జరిగిన పరిశోధనల్లో వెల్లడైందని లాన్సెట్ జర్నల్ పేర్కొంది. 2 నుంచి 18 ఏళ్ల వారి మీద జరిగిన పరిశోధనల్లో కొవాగ్జిన్​ వ్యాక్సిన్ సురక్షితమైనదిగా తేలిందని లాన్సెట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల హర్షం వ్యక్తం చేశారు. పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్లు అత్యంత సురక్షితమైనవి ఉండాలని.. తాము విశ్వసిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత్​లో పిల్లలకు ఇచ్చిన సుమారు 50 మిలియన్​ల కొవాగ్జిన్ డోసులు పిల్లల్లో ఎలాంటి దుష్పరిణామాలు కలిగించటం లేదని స్పష్టం చేశాయన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.