కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో విషాదం జరిగింది. సంతానం లేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. వివాహమై తొమ్మిదేళ్లు గడుస్తున్నా... పిల్లలు కలగకపోవడం బాలకృష్ణ, త్రివేణిలను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. సంతానలేమి బలవన్మరణానికి కారణమైంది. ఈ ఘటనలో భర్త బాలకృష్ణ మృతి చెందగా... తీవ్ర అస్వస్థతకు గురైన త్రివేణిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలకృష్ణ మృతదేహాన్ని నందిగామ మార్చురీకి తరలించారు.
సంతానం లేదని పురుగుల మందు తాగిన దంపతులు - కృష్ణా జిల్లా నేర వార్తలు
పిల్లలు కలగడం లేదని మనస్తాపంతో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త మృతి చెందగా భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన కృష్ణా జిల్లా అనాసాగరం గ్రామంలో జరిగింది.
కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో విషాదం జరిగింది. సంతానం లేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. వివాహమై తొమ్మిదేళ్లు గడుస్తున్నా... పిల్లలు కలగకపోవడం బాలకృష్ణ, త్రివేణిలను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. సంతానలేమి బలవన్మరణానికి కారణమైంది. ఈ ఘటనలో భర్త బాలకృష్ణ మృతి చెందగా... తీవ్ర అస్వస్థతకు గురైన త్రివేణిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలకృష్ణ మృతదేహాన్ని నందిగామ మార్చురీకి తరలించారు.
ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం