ETV Bharat / city

ఏపీలో కరోనా ఉద్దృతి.. ఒక్కరోజులే 6వేలకు పైగా కేసులు

ఏపీలో కరోనా విజృంభణ రోజురోజుకీ ఉద్ధృతమవుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే 6 వేలకుపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రోజూ వెయ్యి చొప్పున కేసులు పెరుగుతుండటం వల్ల... ఆసుపత్రుల్లో పడకలు సహా సౌకర్యాలు పెంచడంపై వైద్యాధికారులు దృష్టిపెట్టారు. మాస్క్‌ వినియోగం సహా కరోనా నియంత్రణ చర్యలపై పోలీసులు, అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా దృష్ట్యా ప్రాచీన కట్టడాలు, పురాతన ప్రాంతాల్లో ప్రవేశాలను వచ్చే నెల 15 వరకూ నిలిపేశారు.

covid vaccine, corona vaccine, ap news
కొవిడ్ వ్యాక్సిన్, కరోనా టీకా, ఏపీ కరోనా కేసులు
author img

By

Published : Apr 17, 2021, 8:23 AM IST

ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతోంది. కొత్తగా 6 వేల 96 మందికి కరోనా నిర్ధరణ కాగా... మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 48 వేల 231కు పెరిగింది. చిత్తూరు జిల్లాలో గరిష్టంగా వెయ్యి 24 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 750, గుంటూరు 735, కర్నూలు 550, విశాఖ 489, శ్రీకాకుళం 534, ప్రకాశం 491, నెల్లూరు 354, అనంతపురం 313, విజయనగరం 299, కృష్ణా 246, కడప జిల్లాలో 243 కేసులు వెలుగుచూడగా... పశ్చిమగోదావరి జిల్లాలో కనిష్టంగా 68 కేసులు బయటపడినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35 వేల 592 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా 2 వేల 194 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహమ్మారి బారిన పడి మరో 20 మంది మృతిచెందగా... మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7 వేల 373కి పెరిగింది.

కర్నూలు జిల్లాలో రోజూ 500కు పైగా కేసులు నమోదవుతున్నందున... నియంత్రణ చర్యలు పెంచినట్లు కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. కరోనా కేసులను గుర్తించేందుకు 21 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కరోనాతో 271 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని... వారిలో 260 మందికి ఆక్సిజన్‌ అందిస్తున్నట్లు వివరించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని సహా మొత్తం 11 కొవిడ్‌ ఆసుపత్రులను సిద్ధం చేశామని వెల్లడించారు.

తూర్పుగోదావరి జిల్లాలో 3 వేల 258 కొవిడ్ యాక్టివ్‌ కేసులున్నాయని... కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. కాకినాడ జీజీహెచ్, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, అమలాపురం కిమ్స్‌ను కొవిడ్‌ ఆసుపత్రులుగా మార్చి... వెయ్యి పడకలు అందుబాటులో ఉంచామన్నారు. కొవిడ్‌ సేవలకు ప్రైవేటు ఆసుపత్రులకూ అనుమతిస్తామన్నారు.

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో... చాలా ప్రాంతాల్లో పడకలు దొరకడమే కష్టమవుతోంది. దీన్ని గుర్తించిన వైద్యాధికారులు... ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో పడకలు పెంచుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 117 ఆసుపత్రుల్లో 2 వేల 136 ఐసీయూ పడకలు ఏర్పాటు చేశారు. వీటిలో 597 పడకల్లో బాధితులు ఉండగా.... 15 వందల 39 పడకలు ఖాళీగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రెండు మంచాలు ఉండే గదుల్లో 9 వేల 544 పడకలు ఉండగా.... అందులో 6 వేల 752 ఖాళీగా ఉన్నాయి.

సాధారణ వార్డుల్లో మొత్తం 4 వేల 442 పడకలు ఉండగా... 3 వేల 130 పడకలు ఖాళీగా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో గడచిన 4 రోజుల్లోనే అధికసంఖ్యలో కేసులు నమోదవటంతో... యుద్ధప్రాతిపదికన పడకలు పెంచుతున్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో48 వేల 232 రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, ఆసుపత్రుల్లో 2 వేల 124 ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ నిల్వలు అడుగంటాయని... కేంద్రం మళ్లీ పంపిస్తేగానీ వ్యాక్సినేషన్‌ చేపట్టలేమని అంటున్నారు. ఇవాళ 5 లక్షల డోసులు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరవాలని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్ణయించింది. దుకాణాల వద్ద భౌతికదూరం పాటించేలా చూడాలని సూచించింది. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజలంతా మాస్క్‌లు ధరించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధాన పట్టణాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. లేనివారిని గుర్తించి మాస్క్‌లు ఇచ్చారు. ఇకపై మాస్క్‌ లేకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ బస్టాండ్లు, బస్సుల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మాస్క్‌ ఉంటేనే అనుమతిస్తున్నారు.

ప్రాచీన కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ఆలయాలను వచ్చే నెల 15 వరకూ మూసివేస్తూ... కేంద్ర పురావస్తుశాఖ ప్రకటన విడుదల చేసింది. కడప జిల్లాలోని 9 ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. ఒంటిమిట్ట కోదండరాముడి గుడి మూసేయడంతో... ఈ నెల 26న సీతారాముల కల్యాణోత్సవం నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఏకాంతంగా ఉత్సవాలు నిర్వహించేలా తితిదే చర్యలు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పర్యాటకులతో నిత్యం కళకళలాడే ప్రఖ్యాత పర్యాటక కేంద్రం గండికోట సహా ఇతర పర్యాటక క్షేత్రాలు మూతపడ్డాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.