ETV Bharat / city

మొదటి లక్షకు 126 రోజులు... రెండో లక్షకు 11 రోజులు - corona effect on andhra

ఏపీలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. ఆరంభంలో నెల్నాళ్ల పాటు రోజుకు కేవలం పదిలోపు మాత్రమే నమోదైన కరోనా కేసులు... మూడు నెలల్లో రోజుకు 10 వేల కేసులు నమోదు అయ్యే పరిస్థితులకు దారి తీశాయి. మార్చి 12న నమోదైన తొలి కరోనా కేసుతో 137 రోజుల విరామం తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల మార్కును దాటేసింది. తొలినాళ్లలో విదేశాల నుంచి వచ్చిన వారితోనూ... ఆ తదుపరి దిల్లీ మర్కజ్ కాంటాక్టులు, కోయంబేడు మార్కెట్, ఇప్పుడు అన్ లాక్ 3.0 కరోనా వ్యాప్తికి ప్రధాన కారణాలుగా మారాయి. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 8 శాతాన్ని మించిందని వైద్యారోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే అత్యధికంగా నిర్ధారణా పరీక్షలు జరుగుతున్నట్టు ప్రభుత్వం చెప్పుకొస్తోంది.

మొదటి లక్షకు 126 రోజులు... రెండో లక్షకు 11 రోజులు

author img

By

Published : Aug 7, 2020, 9:36 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ తీవ్రతరం అవుతూనే ఉంది. మార్చి 12వ తేదీన నెల్లూరులో నమోదైన తొలికేసుతో మొదలైన కరోనా వ్యాప్తి సరిగ్గా 137 రోజుల అనంతరం 2 లక్షల మార్కును దాటేసింది. ఈ తీవ్రత ఏ స్థాయికి చేరుతుందన్నది ప్రస్తుతం అంచనాకు అందని పరిస్థితి. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారితో నెల్లూరులో నమోదైన తొలికేసుతో ఏపీలో వ్యాప్తి మొదలైంది. ఆ తదుపరి దిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కారణంగా తీవ్రతరమైంది. లాక్​డౌన్ ఎత్తివేత అనంతరం అన్​లాక్ ప్రక్రియతోపాటు కోయంబేడు మార్కెట్​లు ఏపీలో పరిస్థితిని దిగజార్చాయి.

వారం వ్యవధిలో...

జూన్ 1తేదీ నాటికి రాష్ట్రంలో 3,674 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. జూన్ 24 తేదీనాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల మార్కును దాటింది. రాష్ట్రవ్యాప్తంగా జులై 24వ తేదీన నమోదైన కేసుల సంఖ్య 10,331గా వైద్యారోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక అక్కడి నుంచి వైరస్ వ్యాప్తి వేగం పుంజుకుంది. వారంరోజుల వ్యవధిలోనే... అంటే జులై 1వ తేదీ నాటికి మరో 5 వేల మందికి వైరస్ సోకింది. జులై ఒకటో తేదీన నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,252గా ప్రభుత్వం తన బులెటిన్​లో పేర్కొంది. ఆ తదుపరి వారం వ్యవధిలో... అంటే జులై 6 తేదీన కరోనా కేసులు 20,019గా నమోదయ్యాయి.

ఆగస్టు 1వ తేదీన..

ఇక 9 రోజుల వ్యవధి అనంతరం జులై 15వ తేదీ నాటికి ఈ సంఖ్య 35, 451కి చేరింది. 20 నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 50 వేల మార్కును దాటేసింది. ఆ తేదీన రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 53,274గా ప్రభుత్వం పేర్కొంది. ఇక 7 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రెట్టింపైంది. జులై 27వ తేదీన రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు లక్షమార్కును దాటి 1,02,349గా నమోదు అయినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక అక్కడినుంచి కేవలం 3 రోజుల వ్యవధిలో 50 వేల కేసులు దీనికి అదనంగా వచ్చి చేరాయి. ఇక ఆగస్టు 1వ తేదీన ఏపీలో 1 లక్షా 50 వేల 209 కేసులు నమోదు అయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

జులై 19వ తేదీ నాటికి..

మార్చి 12న 24 గంటల వ్యవధిలో ఒక్క కేసు వ్యాప్తికి పరిమితమైన వైరస్... జులై 29వ తేదీ నాటికి రోజుకు గరిష్ఠ స్థాయిలో 10,093కు పాకింది. జూన్ 22వ తేదీన ప్రతీ రోజూ 500లోపు కేసులకు మాత్రమే పరిమితమైన వ్యాప్తి ఆ తదుపరి జులై 19వ తేదీ నాటికి 24 గంటల వ్యవధిలో 5,041కి పెరిగింది. జులై 29వ తేదీ నాటికి 10,093, జులై 30న 10,068 మందికి, జులై 31న 10,376 మందికి సోకింది. జులై నెలలో ప్రతీరోజూ పదుల సంఖ్యలోనే కొవిడ్ కారణంగా మరణాలు నమోదు అయ్యాయి. గరిష్ఠంగా ఆగస్టు 5న రాష్ట్రంలో 77 కొవిడ్ మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1753 మంది కొవిడ్ కారణంగా మృతిచెందారు.

ఇప్పటి వరకూ 23 లక్షలకుపైగా..

రాష్ట్రంలో ఇంకా 82 వేల 166 మంది కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 1,09,975 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సగటున రోజుకు 60 వేల వరకూ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇందులో ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టులు 30 వేలు, మిగతా సగం ట్రూనాట్, నాకో, వీఆర్డీఎల్ ల్యాబ్​లలో పరీక్షలు చేస్తున్నట్టు స్పష్టం చేస్తోంది. ఇప్పటి వరకూ 23 లక్షలకుపైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.

నెల్లూరు జిల్లాలో అత్యధికంగా..

కరోనా వ్యాప్తికి కారణమవుతున్న ప్రాంతాలనూ వైద్యారోగ్యశాఖ గుర్తించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాలు కరోనా హాట్​స్పాట్ కేంద్రాలుగా మారాయి. తూర్పుగోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాలు అత్యంత తీవ్రత కలిగిన ప్రాంతాలని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేస్తోంది. వైరస్ విస్తృతి ఎక్కువగా ఉన్న 396 ప్రాంతాలను వైద్యారోగ్యశాఖ గుర్తించింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 207 ఉంటే.. పట్టణ ప్రాంతాల్లో 189 ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 60 హాట్ స్పాట్ కేంద్రాలు ఉంటే కర్నూలు జిల్లాలో 53 హాట్ స్పాట్ కేంద్రాలను గుర్తించారు. కృష్ణా జిల్లాలోనూ 43 ఉన్నాయి.

కోయంబేడు మార్కెట్ కారణంగా..

చిత్తూరులో 37, తూర్పుగోదావరి, గుంటూరులో 35 చొప్పున కరోనా వ్యాప్తికి కారణమైన హాట్​స్పాట్ కేంద్రాలు గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి. విశాఖ నగరంలోనే 29 హాట్​స్పాట్ కేంద్రాలు ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది. చిత్తూరులో 28 ప్రాంతాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వాస్తవానికి తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ కారణంగా చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగింది. అటు అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ గ్రామీణ ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందడానికి కోయంబేడు మార్కెట్ ప్రధాన కారణమని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండీ... 'ప్రజలకు వైద్యం అందనప్పుడు- ప్రభుత్వం ఉండి ఏం లాభం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.