ETV Bharat / city

బ్రిటన్‌ నుంచి రాజమహేంద్రవరానికి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌ - coronavirus strain case in rajamahendravaram

బ్రిటన్‌ నుంచి ఈ నెల 21న దిల్లీకి వచ్చిన ఏపీలోని రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.

corona-positive-for-a-woman-who-come-from-britain-to-rajamahendravaram
బ్రిటన్‌ నుంచి రాజమహేంద్రవరానికి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌
author img

By

Published : Dec 24, 2020, 7:52 AM IST

బ్రిటన్‌ నుంచి ఈ నెల 21న దిల్లీకి వచ్చిన ఏపీలోని రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావడం వల్ల జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె దిల్లీ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో బుధవారం రాత్రి రాజమహేంద్రవరానికి వచ్చారు. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆమెను స్టేషన్‌ నుంచి నేరుగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

విదేశీ ప్రయాణికులపై ఆరా

బ్రిటన్‌లో కొత్తరకం వైరస్‌ విజృంభిస్తుండటంతో.. రాష్ట్రంలోకి ప్రవేశించిన అంతర్జాతీయ విమాన ప్రయాణికుల వివరాలను ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సేకరిస్తోంది. గడిచిన 2 వారాల్లో రాష్ట్రంలోకి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలు తెలపాలని ఇమ్మిగ్రేషన్‌ అధికారులను కోరింది.

ఇదీ చూడండి: మరో వేషంలో మహమ్మారి.. మరింత ప్రమాదకారి.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.