ETV Bharat / city

Corona : కరోనా దూరం చేసి కలవరపెట్టింది.. దగ్గరచేసి కలుపుతోంది - corona cases in telangana

కరోనా మహమ్మారి ఏనాడో మరిచిన బంధాలను కలుపుతోంది. వృత్తి, వ్యాపార రీత్యా బంధువులు, స్నేహితులకు దూరమైన వారిని దగ్గర చేస్తోంది. కొవిడ్ ఎన్ని కష్టాలు పెట్టిస్తుందో.. వాటిని ఎదుర్కోవడానికి నా అనే వారు పక్కన ఉండేలా చేస్తోందని మానసిక నిపుణులు అంటున్నారు. ఈ మహమ్మారి వల్ల మనుషులకు బంధాల విలువ తెలిసొచ్చిందని చెబుతున్నారు.

corona effect, corona effect on relations
బంధాలపై కరోనా ప్రభావం, కరోనా కలిపిన బంధాలు
author img

By

Published : Jun 5, 2021, 8:31 AM IST

  • ఆమె భర్తది ఉన్నతస్థాయి కొలువు. దీంతో సామాజికహోదా పెరిగింది. ఈ క్రమంలో ఊళ్లోని బంధువులు.. బాల్యస్నేహితులతో చనువుగా ఉంటే తమ పెద్దరికం దెబ్బతింటుంటున్న భావించిన ఆమె.. దాదాపు 30 ఏళ్లపాటు వారితో అంటీముట్టనట్లుగానే వ్యవహరించింది. కొవిడ్‌ కష్ట కాలంలో ఆ ఇల్లాలికి బంధాలు, బంధుత్వాల విలువ తెలిసొచ్చింది. ఇన్నేళ్లు తానేం కోల్పోయాననే విషయమూ అర్థమైంది. ప్రస్తుతం చిన్నా..పెద్ద అనే తేడాలేకుండా ఫోన్‌నంబర్లు సేకరించి మరీ.. తమవారి క్షేమ సమాచారం కోసం ఆచూకీ తీసింది. పిల్లల చదువులకు డబ్బు అవసరం ఉందని గ్రహించిన చోట తానే వారికి ఆన్‌లైన్‌ ద్వారా ఆర్థి.కసాయం అందించింది. కొంపల్లిలో ఉన్న ఓ గృహిణి కరీంనగర్‌ జిల్లాలోని తమ వారి కోసం చేసిన ఆలోచన ఇది..

వరంగల్‌ జిల్లా నుంచి నగరం చేరిన ఓ యువకుడు.. స్థిరాస్తి రంగంలో కుదురుకున్నాడు. గచ్చిబౌలిలో సొంతిల్లు.. ఖరీదైన కార్లు కొన్నారు. పిల్లలిద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. ఆర్థికంగా ఎదిగేకొద్దీ ఉన్నతస్థాయిలో స్నేహాలు పెరిగాయి. రెణ్నెల్ల క్రితం ఆ వ్యాపారికి కొవిడ్‌ సోకింది. ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో పనిచేసే సిబ్బందిలో ఒకరు వ్యాపారి సొంతూరుకు చెందిన వ్యక్తే అని గుర్తించాడు. కోలుకుని ఇల్లు చేరాక తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యాడు. కరోనా బాధితుల సహాయకులకు ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రస్తుతం ఆహారం పంపిణీ చేస్తున్నారు.

- బంజారాహిల్స్‌ బసవతారకం ఆసుపత్రి వద్ద ఆహారం పంచుతున్న వ్యక్తి పంచుకున్న అనుభవం.

ఏనాడో మరచిపోయిన బంధువులను గుర్తుచేసుకుంటున్నారు. ఫోన్‌నంబర్లు సేకరించి మరీ క్షేమసమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. కొవిడ్‌ కష్టకాలంలో బంధాల విలువ ఒక్కసారిగా తెలిసొచ్చింది. కరోనా రెండో దశ ఎంతటి బీభత్సం సృష్టించిందో అదేవిధంగా మానవ సంబంధాలనూ మరింత దగ్గరచేసేందుకు మార్గం చూపిందంటున్నారు మనస్తత్వ నిపుణులు. ముఖ్యంగా ఉపాధి, ఉద్యోగ బాటలో లక్షలాది కుటుంబాలు సొంతూళ్లు వదలి నగర బాట పడుతుంటాయి. అనంతరం వారిలో ఎంతోమంది అవరోధాలను తట్టుకుంటూ, కష్టపడుతూ ఉన్నతంగా ఎదుగుతున్నారు. లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో పాతస్నేహాలు మరిచిపోతుంటారు. మరికొందరు కొత్త పరిచయాలతో అప్పటివరకూ తోడుగా నిలిచిన ఆప్తులను దూరం చేసుకుంటారు. ఇలాంటి వారందరికీ కొవిడ్‌ సమయంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు ఎన్నో నేర్పించాయి. కళ్లెదుట తెలిసినవారు, ఆత్మీయులు దూరమవుతుంటే కలవరపడ్డారు.

కుశలమేనా..

ఆత్మీయత.. చేయూత

‘అపార్ట్‌మెంట్‌లో ఉండే అన్ని కుటుంబాలు కలిసే పండుగలు చేసుకుంటాం. కొందరు మాత్రం ఇళ్లకే పరిమితమయ్యేవారు. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నా మేము పల్లెటూరి నుంచి వచ్చామనే చులకన భావం కనిపించేది. ఇటీవల వారిలో కొందరికి కొవిడ్‌ సోకినపుడు అవసరమైన మందులు, ఆహారపదార్థాలు మేమే పంపాం. ధైర్యం చెబుతూ వచ్చాం. కోలుకున్న వారిలో కొంతమార్పును గమనించాం’ అని మియాపూర్‌లోని నివసిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శైలజ వివరించారు. మహిళలందరూ కలిసి సరదాగా జరుపుకునే కిట్టీపార్టీలకు రమ్మంటే వద్దని వారించే స్నేహితురాలు హోదాను పక్కనబెట్టి.. ఈ దఫా అందరం కలుద్దామంటూ ఫోన్‌చేసి మరీ చెప్పిందంటూ ఏ.ఎస్‌.రావునగర్‌కు చెందిన గృహిణి కవిత తెలిపారు. ఐటీ సంస్థలు కల్పించిన వర్క్‌ఫ్రం హోమ్‌తో యువతీ, యువకులు సొంతూళ్లు చేరారు. తల్లిదండ్రుల బాగోగులను చూసుకునేందుకు అవకాశం లభించిందంటున్నారు ఐటీ ఉద్యోగి కార్తీక్‌ పల్లం. మరికొందరు ఆర్ధికంగా స్ధిరపడిన ఉద్యోగులు, వ్యాపారులు సొంతూళ్లకు వైద్య పరికరాలనూ పంపుతూ ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నారు.

ఉత్సుకత.. ఆప్యాయత

కొవిడ్‌ మరణాలు చాలామందిని మానసికంగా కుంగదీశాయి. ఈ నేపథ్యంలో దూరప్రాంతాల్లో ఉన్న తమ వాళ్లు ఎలా ఉన్నారనేది తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రతిఒక్కరిలో పెరిగింది. ఫోన్‌చేసి బాగోగులు వాకబు చేసి ఊపిరి పీల్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు నగరంలో ఉన్న తమ సంబంధీకుల కోసం ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడున్న ఉద్యోగ, వ్యాపార వర్గాలకు చెందినవారు కూడా పాత స్నేహితులు, దూరమైన బంధువుల ఆచూకీ, క్షేమ సమాచారం కోసం ఆరా తీస్తున్నారంటూ కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు అనిత అరే విశ్లేషించారు. మానవ సంబంధాలు మాత్రమే కాదు.. ఆకలి విలువ కూడా ప్రస్తుతం తెలిసొచ్చింది. ఇప్పటివరకూ చేసిన తప్పొప్పులను గ్రహిస్తున్నారు. కష్టకాలంలో తమ వెన్నంటి ఎవరున్నారనే అంశాలను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రతికూల వాతావరణం అవకాశం కల్పించిందని ఆమె వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.