ETV Bharat / city

Corona Death certificates : జిల్లాల్లోనే కొవిడ్ మరణ ధ్రువపత్రాలు.. - తెలంగాణలో కరోనా మరణ ధ్రువపత్రాలు

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. మరణ ధ్రువపత్రాల(Corona Death certificates) జారీకి జిల్లా స్థాయిలో త్రిసభ్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కలెక్టర్ ఛైర్మన్​గా, డీఎంహెచ్​వో, జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ సభ్యులుగా ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Corona Death certificates
Corona Death certificates
author img

By

Published : Nov 9, 2021, 6:42 AM IST

కరోనా మృతుల కుటుంబాలకు సాంత్వన కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కొవిడ్‌తో మృతిచెందినట్లుగా అధికారికంగా ధ్రువీకరణ పత్రాన్ని(Corona Death certificates) జారీ చేసేందుకు జిల్లాల స్థాయిలో త్రిసభ్య కమిటీని నియమిస్తూ వైద్యఆరోగ్యశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి(డీఎంహెచ్‌వో), జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సభ్యులుగా ఉంటారు.

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ధ్రువపత్రాల(Corona Death certificates) జారీకి జిల్లా స్థాయిల్లో కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర విపత్తు నిర్వహణశాఖ నిధుల నుంచి రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు పరిహారాన్ని చెల్లిస్తారు. అర్హులైన లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాలోనే నేరుగా జమ చేస్తారు. కొవిడ్‌ మరణ ధ్రువపత్రం(Corona Death certificates) కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో పేర్కొంటూ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ(Telangana Health Ministry) తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి..

  • ఆసుపత్రిలో కొవిడ్‌తో చనిపోయినప్పుడు కొందరికి ఆ మేరకు ధ్రువపత్రాన్ని ఇచ్చారు. అలా నేరుగా ధ్రువపత్రం పొందిన వారు మళ్లీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వారు నేరుగా నష్టపరిహారానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అకాల మరణాలు సంభవించినప్పుడు మృతుడికి పరీక్షల్లో పాజిటివ్‌ అని నిర్ధారణ అయినా ఆ మరణాన్ని కొవిడ్‌ మరణంగా పరిగణించరు.
  • కొవిడ్‌ బారినపడిన 30 రోజుల్లోగా బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందితే.. దాన్ని కరోనా మరణంగానే పరిగణనలోకి తీసుకోవాలని భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) సూచించింది.
  • కరోనా అని నిర్ధారణ అయ్యాక ఇంటి వద్దే చికిత్స పొందుతూ కొందరు చనిపోతారు. సంబంధిత ధ్రువపత్రాన్ని పరిగణనలోకి తీసుకొని ఇంటి వద్ద 30 రోజుల్లోగా చనిపోయినా ఆ మరణాన్ని కొవిడ్‌ మృతిగానే పరిగణించాలి.
  • ఈ కేటగిరీల్లోకి రాకుండా కూడా మహమ్మారి బారిన పడి మృతిచెందిన వారుంటారు. వారికి మరణ ధ్రువీకరణ పత్రంలో కొవిడ్‌ కారణమని నిర్ధారణ చేయకపోవచ్చు కూడా. ఇలాంటి వాటిలో మృతుల కుటుంబ సభ్యులు తమ రక్తసంబంధీకుడి మృతికి కరోనానే కారణమని విశ్వసించినట్లయితే.. సంబంధిత నిర్ధారణ పత్రాలను జత చేస్తూ జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీకి ‘కొవిడ్‌ మరణ ధ్రువపత్రాన్ని’ జారీ చేయాలని కోరుతూ మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా త్రిసభ్య కమిటీ ధ్రువపత్రాన్ని జారీ చేయాలి. తిరస్కరిస్తే అందుకు తగు కారణాలను తెలపాలి.
  • పరిహారాన్ని ఆశిస్తూ కొవిడ్‌ మృతుల కుటుంబసభ్యులు మీసేవ ద్వారానే జిల్లా కలెక్టరుకు దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా నష్టపరిహారాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ ద్వారా అందజేస్తారు.

ఇదీ చదవండి : fake notes seized : గోల్కొండలో రూ.2కోట్ల నకిలీ నోట్లు పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.