రాష్ట్రంలో మరో 149 కరోనా కేసులు, ఒకరు మృతి - today corona case in telangana
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. మహమ్మారిపై ప్రజలకు అవగాహన రావడం, కొవిడ్ నిబంధనలు పటిష్ఠంగా పాటించడం వల్ల కేసులు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా మరో 149 కొవిడ్ కేసులు నమోదవ్వగా.. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు.

రాష్ట్రంలో మరో 149 కరోనా కేసులు
రాష్ట్రంలో మరో 149 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 2,95,831 మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,612 మంది మరణించారు.
మరో 186 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ బారి నుంచి బయటపడిన మొత్తం బాధితుల సంఖ్య 2,92,415కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,804 కరోనా యాక్టివ్ కేసులుండగా.. 694 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 25 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి : కొత్త ఔషధంతో కరోనాకు సత్వర ఉపశమనం