కరోనా గురించి అవగాహన కల్పించేందుకు కవులు, కళాకారులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కవులు పాటలు, కవితలు రాయగా.. తాజాగా జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం మాణిక్యాలపురం ఒగ్గు కళాకారులు ఒగ్గుకథ రూపొందించారు.
సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించాలని తగు జాగ్రత్తలు చెప్తూ ఒగ్గు కళాకారుడు రవి ఒగ్గుకథ రూపొందించారు. సీఎం కేసీఆర్ కళాకారులు, కవులు కరోనా పట్ల అవగాహన కల్పించాలని ఇచ్చిన పిలుపు మేరకు నా వంతు బాధ్యతగా ఈ ఒగ్గుకథ అందించాను అన్నాడు ఒగ్గు రవి.
ఇవీ చూడండి: తెలంగాణలో 154కు చేరిన కరోనా కేసులు