ETV Bharat / city

పరీక్షల కోసం వచ్చిన 8 మంది గర్భిణులకు కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎనిమిది మంది గర్భిణులకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. వారందరినీ బత్తలపల్లి ఆర్​డీటీ కొవిడ్ ఆసుపత్రికి తరలించారు.

corona positve
పరీక్షల కోసం వచ్చిన 8 మంది గర్భిణులకు కరోనా పాజిటివ్
author img

By

Published : Jun 22, 2020, 10:59 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎనిమిది మంది గర్భిణులకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. ఈ నెల 19న ధర్మవరంలో గర్భిణులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా వచ్చిన ఫలితాల్లో వారికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

కరోనా సోకిన గర్భిణులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 108 వాహనంలో బత్తలపల్లి ఆర్​డీటీ కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. వారికి కరోనా ఎలా సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి వీరంతా వెళ్లినట్లు బంధువులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి : గూగుల్​ పే కస్టమర్​ కేర్​ పేరుతో మోసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.