ETV Bharat / city

గ్రేటర్​ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తులు.. - గ్రేటర్​పై కాంగ్రెస్ గురి

తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్​లో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. డివిజన్ల వారీగా నాయకులతో సమీక్షలు నిర్వహిస్తూ... క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేసుకుంటోంది. స్థానిక కమిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే రిజర్వేషన్​లు కూడా ప్రకటించడం వల్ల కాంగ్రెస్ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసింది.

congress leaders prepare plan for greater hyderabad elections
గ్రేటర్​ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తులు
author img

By

Published : Nov 5, 2020, 10:27 AM IST

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల హడావుడి ముగియడం వల్ల గ్రేటర్ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. తెలంగాణకు తలమానికమైన హైదరాబాద్​లో... పార్టీని బలోపేతం చేసే దిశలో రాష్ట్ర నాయకత్వం అడుగులు ముందుకేస్తోంది. గ్రేటర్​లో గత రిజర్వేషన్లనే పరిగణనలోకి తీసుకోనున్నట్టు ప్రకటించడం వల్ల ఎన్నికల ప్రక్రియకు నాంది పలికినట్టైంది. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

దుబ్బాక ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కలిసికట్టుగా పని చేసిన కాంగ్రెస్ శ్రేణులు కాస్త వేగం పెంచారు. డివిజన్ల వారీగా తమ బలాబలాలను అంచనా వేసుకుంటూ... బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన చేస్తోంది. డివిజన్ల పరిధిలో వివిధ విభాగాలకు చెందిన కమిటీలు ఏర్పాటు పూర్తి చేసిన కాంగ్రెస్... ఇంకా పెండింగ్ ఉన్న కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించింది.

డివిజన్​ల వారీగా సమావేశాలు..

నగరంలోని పార్టీ డివిజన్ ఇంఛార్జ్​లతో సమావేశాలు నిర్వహిస్తూ... ఎన్నికల సందర్భంగా వ్యవహరించాల్సిన వ్యూహాలపై పీసీసీ దిశానిర్దేశం చేసింది. అందులో భాగంగానే బుధవారం నాడు మల్కాజిగిరి లోక్​సభ నియోజకవర్గం పరిధిలోని డివిజన్ అధ్యక్షులతో ఇందిరా భవన్​లో సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు ఎవరనేది పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని స్పష్టం చేసింది. ఆయా డివిజన్​ల సీనియర్ నేతలతో సమావేశమై... పార్టీ బలోపేతానికి పీసీసీ సలహాలు తీసుకుంటోంది. శ్రేణులను అప్రమత్తం చేసి చురుకైన పాత్ర పోషించేలా చర్యలు తీసుకుంటోంది.

మాణిక్కం రాకతో పరుగులు..

రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​గా మాణిక్కం ఠాగూర్​ నియామకంతో పార్టీ పనితీరులో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీలో ఐక్యత తీసుకువచ్చి రాష్ట్ర నాయకత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఉన్న అసంతృప్తులను కూడా కలుపుకొని ముందుకెళుతున్నారు. అందులో భాగంగానే చాలా కాలంగా అసంతృప్తితో ఉన్న విజయశాంతిని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆమెను కలిసినట్టు తెలియగానే... పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్​ని పంపి ఆమెతో చర్చించారు. నిన్న రాత్రి స్వయంగా మాణిక్కం ఠాగూర్ ఆమె ఇంటికి వెళ్లి... విజయశాంతి ఆలోచన ఏంటో తెలుసుకున్నారు. నాయకులు చేజారకుండా చూసుకుంటూ పార్టీని బలోపేతం చేసే దిశలో రాష్ట్ర నాయకత్వం ముందుకెళ్తోంది.

ఇదీ చూడండి: రాజుల కాలపు వైభవాన్ని తలపించేలా.. యాదాద్రి క్షేత్ర రూపకల్పన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.