ETV Bharat / city

Shashi Tharoor: హైదరాబాద్​లో బిజీబిజీగా పార్లమెంటరీ స్థాయి సంఘం..

author img

By

Published : Sep 8, 2021, 8:48 PM IST

హైదరాబాద్​లో పార్లమెంటరీ స్థాయి సంఘం పర్యటన నేడు బిజీబిజీగా సాగింది. మొదట గ్రీన్​ఇండియా ఛాలెంజ్​లో భాగంగా శిల్పారామంలో మొక్కలు నాటిన సభ్యులు.. అనంతరం మంత్రి కేటీఆర్​తో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యక్షుడు శశిథరూర్​.. టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబును కలిశారు.

congress leader shashi tharoor met super star mahesh babu in hyderabad

హైదరాబాద్​లో పర్యటిస్తోన్న పార్లమెంటరీ స్థాయి సంఘం.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​తో భేటీ అయింది. మంగళవారం రోజు హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో భాగమైన టీహబ్, తెలంగాణ డేటా సెంటర్​ను సందర్శించిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ నేతృత్వంలో ఐటీ స్థాయి సంఘం.. ఇవాళ హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ హోటల్​లో కేటీఆర్​తో పాటు ఐటీ శాఖ అధికారులతో సమావేశమైంది. రాష్ట్రంలో ఐటీ ఎకోసిస్టం ఎవాల్వింగ్, ఐటీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం పరంగా తీసుకుంటున్న చర్యలను మంత్రి కేటీఆర్​.. కమిటీకి వివరించారు. ఐటీ, ఇండస్ట్రీతో రాష్ట్రంలోని ఇన్నోవేషన్ ఎకోసిస్టం, అకడమియా బిగ్ సపోర్ట్​గా నిలుస్తున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. సమావేశం అనంతరం ఎంపీ శశిథరూర్​తో కూడిన స్థాయి సంఘం ప్రతినిధులను మంత్రి కేటీఆర్ సన్మానించారు. తెలంగాణ చేనేత వస్త్రాలు, కళాకృతులను బహుకరించారు.

మహేశ్​తో సరదాగా ముచ్చట..

సమావేశం అనంతరం అదే హోటల్​లో షూటింగ్ జరుపుకుంటోన్న హీరో మహేశ్​ బాబును పార్లమెంట్ స్థాయి సంఘం అధ్యక్షులు ఎంపీ శశిథరూర్ కలుసుకున్నారు. మహేశ్​ బాబు బంధువు ఎంపీ గల్లా జయదేవ్​తో కలిసి సరదాగా ముచ్చటించారు. ముగ్గురు కలిసి మాట్లాడుకున్న వీడియోను శశిథరూర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబును కలవడం తనకు సంతోషాన్నిచ్చిందని శశిథరూర్ ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

  • Talking to MaheshBabu ⁦@urstrulyMahesh⁩ shows you why no one in Hyderabad refers to him without the honorific “Superstar”! He had just finished knocking out the villain in his next production when we had a chat behind the scenes… ⁦@JayGallapic.twitter.com/2ZaKSVBOIi

    — Shashi Tharoor (@ShashiTharoor) September 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Talking to MaheshBabu ⁦@urstrulyMahesh⁩ shows you why no one in Hyderabad refers to him without the honorific “Superstar”! He had just finished knocking out the villain in his next production when we had a chat behind the scenes… ⁦@JayGallapic.twitter.com/2ZaKSVBOIi

— Shashi Tharoor (@ShashiTharoor) September 8, 2021

శిల్పారామంలో గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​...

అంతకు ముందు... ఐటీ పార్లమెంటరీ కమిటీ సభ్యులు శిల్పారామంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సలహా మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కమిటీ ఛైర్మన్ శశిథరూర్ తెలిపారు. హైదరాబాద్​తో పాటు దేశంలో కూడా హరిత ప్రాంతాన్ని నిర్మించేందుకు తమ వంతు కృషి చేద్దామని సూచించారు. అభివృద్ధి అంటే భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకోవటమేనని అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం అందరిపై ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ వార్మింగ్​ను అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని శశిథరూర్​ కోరారు.

ఇదీ చూడండి:

PSC on T-Hub: 'ప్రతి రాష్ట్రం టీహబ్ లాంటి సిస్టం కలిగి ఉండాలి'

హైదరాబాద్​లో పర్యటిస్తోన్న పార్లమెంటరీ స్థాయి సంఘం.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​తో భేటీ అయింది. మంగళవారం రోజు హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో భాగమైన టీహబ్, తెలంగాణ డేటా సెంటర్​ను సందర్శించిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ నేతృత్వంలో ఐటీ స్థాయి సంఘం.. ఇవాళ హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ హోటల్​లో కేటీఆర్​తో పాటు ఐటీ శాఖ అధికారులతో సమావేశమైంది. రాష్ట్రంలో ఐటీ ఎకోసిస్టం ఎవాల్వింగ్, ఐటీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం పరంగా తీసుకుంటున్న చర్యలను మంత్రి కేటీఆర్​.. కమిటీకి వివరించారు. ఐటీ, ఇండస్ట్రీతో రాష్ట్రంలోని ఇన్నోవేషన్ ఎకోసిస్టం, అకడమియా బిగ్ సపోర్ట్​గా నిలుస్తున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. సమావేశం అనంతరం ఎంపీ శశిథరూర్​తో కూడిన స్థాయి సంఘం ప్రతినిధులను మంత్రి కేటీఆర్ సన్మానించారు. తెలంగాణ చేనేత వస్త్రాలు, కళాకృతులను బహుకరించారు.

మహేశ్​తో సరదాగా ముచ్చట..

సమావేశం అనంతరం అదే హోటల్​లో షూటింగ్ జరుపుకుంటోన్న హీరో మహేశ్​ బాబును పార్లమెంట్ స్థాయి సంఘం అధ్యక్షులు ఎంపీ శశిథరూర్ కలుసుకున్నారు. మహేశ్​ బాబు బంధువు ఎంపీ గల్లా జయదేవ్​తో కలిసి సరదాగా ముచ్చటించారు. ముగ్గురు కలిసి మాట్లాడుకున్న వీడియోను శశిథరూర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబును కలవడం తనకు సంతోషాన్నిచ్చిందని శశిథరూర్ ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

  • Talking to MaheshBabu ⁦@urstrulyMahesh⁩ shows you why no one in Hyderabad refers to him without the honorific “Superstar”! He had just finished knocking out the villain in his next production when we had a chat behind the scenes… ⁦@JayGallapic.twitter.com/2ZaKSVBOIi

    — Shashi Tharoor (@ShashiTharoor) September 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

శిల్పారామంలో గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​...

అంతకు ముందు... ఐటీ పార్లమెంటరీ కమిటీ సభ్యులు శిల్పారామంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సలహా మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కమిటీ ఛైర్మన్ శశిథరూర్ తెలిపారు. హైదరాబాద్​తో పాటు దేశంలో కూడా హరిత ప్రాంతాన్ని నిర్మించేందుకు తమ వంతు కృషి చేద్దామని సూచించారు. అభివృద్ధి అంటే భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకోవటమేనని అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం అందరిపై ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ వార్మింగ్​ను అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని శశిథరూర్​ కోరారు.

ఇదీ చూడండి:

PSC on T-Hub: 'ప్రతి రాష్ట్రం టీహబ్ లాంటి సిస్టం కలిగి ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.