ETV Bharat / city

మంచి పీఆర్సీ ఇస్తారని ఉద్యోగులు ఆశించారు: కాంగ్రెస్​

పీఆర్సీ నివేదికపై కాంగ్రెస్​ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 7.5 శాతం ఫిట్​మెంట్​ ఇవ్వాలని.. పీఆర్స్​ కమిటీ సిఫార్సు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

congress leader comments on prc report 2021
మంచి పీఆర్సీ ఇస్తారని ఉద్యోగులు ఆశించారు: కాంగ్రెస్​
author img

By

Published : Jan 27, 2021, 6:53 PM IST

పీఆర్​సీ నివేదికకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ ఆందోళనకు దిగింది. నివేదిక ప్రతులతో బీఆర్కే భవన్​ వద్దకు వచ్చిన.. ఆ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎస్​ను కలుస్తామన్న పీసీసీ అధికాల ప్రతినిధులను పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

గణతంత్ర వేడుకరోజున సీఎం కేసీఆర్​ నుంచి మంచి ప్రకటన వస్తుందేమోనని ఉద్యోగులంతా వేచిచూశారని కాంగ్రెస్​ నేత చిన్నారెడ్డి అన్నారు. మంచి పీఆర్సీ ఇస్తారని ఉద్యోగులు ఆశించారన్నారు. కేవలం 7.5 శాతం ఫిట్​మెంట్​ ఇవ్వాలని.. కమిటీ సిఫార్సు చేయడం చాలా దారుణమన్నారు.

ఈ నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధమని ప్రకటించారు. ఉద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం మరోసారి మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంచి పీఆర్సీ ఇస్తారని ఉద్యోగులు ఆశించారు: కాంగ్రెస్​

ఇవీచూడండి: మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని పీఆర్సీ నివేదిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.