ETV Bharat / city

Telangana Congress: హుజూరాబాద్​ ఎఫెక్ట్​.. అధిష్ఠానం నుంచి కాంగ్రెస్​ నేతలకు పిలుపు - AICC serious on huzurabad result

కాంగ్రెస్​ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు (congress high command calls telangana leaders)వచ్చింది. ఈనెల 13న.. పీసీసీ అధ్యక్షుడు సహా సుమారు 13 మంది నేతలు దిల్లీ రావాలని ఆదేశించింది. హుజూరాబాద్​ (huzurabad by poll result) వైఫల్యంపై ఏఐసీసీ స్థాయిలో సమీక్షించనున్నట్లు సమాచారం.

Telangana congress
Telangana congress
author img

By

Published : Nov 11, 2021, 10:58 PM IST

రాష్ట్ర కాంగ్రెస్​ నేతలకు అధిష్ఠానం నుంచి (congress high command calls telangana leaders to delhi)పిలుపు వచ్చింది. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో ఘోర పరాజయంపై వివరణ ఇచ్చేందుకు దిల్లీ (congress high command calls telangana leaders) రావాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలను ఆదేశించింది. ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు కేవలం మూడు వేల ఓట్లే వచ్చిన అంశాన్ని పార్టీ హైకమాండ్​ తీవ్రంగా పరిగణించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే హుజూరాబాద్‌ ఓటమిపై కర్ణాటక రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే నేతృత్వంలో ఓ కమిటీని వేసిన ఏఐసీసీ.. నెల రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

రాష్ట్రం నుంచి 13 మంది నేతలు ఈనెల 13న ఉదయం 10 గంటలకు దిల్లీకి రావాలని (congress high command calls telangana leaders) ఏఐసీసీ ఆదేశించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇద్దరు ఏఐసీసీ ఇంఛార్జీ కార్యదర్శులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, హుజూరాబాద్​ ఉపఎన్నికల అభ్యర్థి బల్మూరి వెంకట్‌, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహ తదితరులు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తక్కువ ఓట్లు రావడానికి కారణాలు (huzurabad by poll result) ఏమిటి? ఇతర పార్టీల బలాలు ఏమిటి? కాంగ్రెస్‌ పార్టీ బలహీనతలు ఏమిటి? అభ్యర్థి ఎంపికలో చోటు చేసుకున్న జాప్యం, ప్రచారం నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యం తదితర అంశాలపై ఏఐసీసీ స్థాయిలో సమీక్ష చేసేందుకు కాంగ్రెస్​ నేతలను అధిష్ఠానం దిల్లీకి పిలిచినట్లు ఆ పార్టీ సీనియర్​ నేత వి.హనుమంతురావు తెలిపారు.

ఇదీచూడండి: congress defeated: కాంగ్రెస్ కకావికలం.. రేవంత్ క్రేజ్ ఏమైంది... ఓటర్లెందుకు చేయిచ్చారు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.