ETV Bharat / city

తెరాస కార్పొరేటర్లు బాగా పనిచేస్తే.. కొత్తవారికి టికెట్ ఎందుకిచ్చారు?

author img

By

Published : Nov 21, 2020, 2:18 PM IST

జీహెచ్​ఎంసీ ఉప్పల్ డివిజన్​లో తెరాస నాయకులు బాగా పనిచేస్తే.. కొత్త అభ్యర్థికి టికెట్ ఎందుకిచ్చారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. భాజపా, తెరాస నేతలు పాము-ముంగీస ఆటలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

Rewanth Reddy campaign in Uppal division
ఉప్పల్ డివిజన్​లో రేవంత్ రెడ్డి ప్రచారం

హైదరాబాద్​లో రూ.67 కోట్లు ఖర్చు చేశామంటున్న మంత్రి కేటీఆర్.. ఉప్పల్ డివిజన్​లో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తనకు తోడుగా ముప్పై మంది కార్పొరేటర్లు ఉంటే.. కేసీఆర్, మోదీలతోనే కాదు..ఎవ్వరితోనైనా కొట్లాడతానని స్పష్టం చేశారు.

హైదరాబాద్ ఉప్పల్ డివిజన్​లో తెరాస నాయకులు బాగా పనిచేస్తే.. పాత కార్పొరేటర్​ను మార్చి కొత్త అభ్యర్థికి టికెట్ ఎందుకిచ్చారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. భాజపా, తెరాసలు పాము-ముంగీస ఆటలాడుతూ ప్రజలను మాయల్లో ముంచుతున్నారని ఆరోపించారు. ఉప్పల్ డివిజన్​లో పలువురు తెరాస కార్యకర్తలు.. కాంగ్రెస్ అభ్యర్థి రజితా పరమేశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్​లో చేరారు. వారికి కండువా కప్పి ఎంపీ రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.