ETV Bharat / city

'ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​'లో భాగంగా కవి సమ్మేళనాలు - telangana latest news

అన్ని జిల్లా కేంద్రాలు, రాష్ట్రస్థాయిలో రవీంద్రభారతిలో ఏప్రిల్ 3న కవి సమ్మేళనాలు నిర్వహించాలని కలెక్టర్లను సాంస్కృతిక శాఖ సంచాలకులు కోరారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమంలో భాగంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

telangana government
ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్
author img

By

Published : Mar 28, 2021, 4:31 PM IST

ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​లో భాగంగా ఏప్రిల్ 3న అన్ని జిల్లా కేంద్రాలు, రాష్ట్రస్థాయిలో రవీంద్రభారతిలో కవి సమ్మేళనాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించిందని సాంస్కృతిక శాఖ సంచాలకులు, మహోత్సవాల కమిటీ సభ్య కార్యదర్శి మామిడి హరికృష్ణ తెలిపారు. కవి సమ్మేళనానికి స్వాతంత్య్ర స్ఫూర్తిని థీమ్​గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

స్వాతంత్య్ర పోరాట ఘట్టాలు గురించి నేటితరం యువత, పిల్లలకు అవగాహన కల్పించేందుకు ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కమిటీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని హరికృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా కవి సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను కోరారు.

ఇవీచూడండి: రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా ఫ్రీడం రన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.