ETV Bharat / city

ఫలించిన గులాబీ దళపతి వ్యూహం.. ఇక దూకుడే! - తెలంగాణ తాజా వార్తలు

పట్టభద్రుల ఎన్నికల్లో గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్​ వ్యూహం ఫలించింది. అన్ని పక్షాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన పోరులో తెరాస రెండు స్థానాలను కైవసం చేసుకొంది. ఇదే నూతనోత్సాహంతో సాగర్​ పోరులో జయభేరీ మోగించేందుకు గులాబీ దళం సన్నద్ధమవుతోంది.

kcr
ఫలించిన గులాబీ దళపతి వ్యూహం.. ఇక దూకుడే
author img

By

Published : Mar 21, 2021, 7:27 AM IST

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి సత్తా చాటింది. ‘హైదరాబాద్‌’లో పార్టీ అభ్యర్థి వాణీదేవి, నల్గొండ’లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో జరిగిన ఈ పోరులో ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడుతూ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ మరోసారి ముందుండి శ్రేణులను నడిపారు. విజయానికి బాటలు వేశారు.

దుబ్బాక, జీహెచ్‌ఎంసీలలో ఎదురైన ఎదురుదెబ్బలతో తెరాస ప్రాబల్యంపై సందేహాలు నెలకొన్న తరుణంలో ఈ ఎన్నికలు పార్టీకి సవాలుగా మారాయి. తెరాస అధికారంలోకి వచ్చాక అధిక శాతం పట్టభద్ర స్థానాల్లో ఆది నుంచి ఈ పార్టీకి చేదు అనుభవాలే. 2015లో ‘నల్గొండ’ స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించినా...‘హైదరాబాద్‌’లో భాజపా గెలిచింది. మెదక్‌-కరీంనగర్‌-నిజామాబాద్‌ స్థానంలో తెరాస పరోక్షంగా మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓడిపోయారు.

గెలుపు అనివార్యంగా భావించి...

ఉద్యోగులు, నిరుద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత, ఇతర ప్రతికూలతలతో కూడిన వాతావరణంలో రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలు నెగ్గడం తెరాసకు అనివార్యమైంది. దీంతో కేసీఆర్‌ ఆరు నెలల ముందు నుంచే వ్యూహరచన ప్రారంభించారు. ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో పెద్దఎత్తున పట్టభద్రులు ఓట్లు నమోదు చేసుకునేలా చూశారు. నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు, మండలాలు, డివిజన్ల వారీగా స్థానిక ప్రజాప్రతినిధులకు లక్ష్యాలను నిర్దేశించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఇన్‌ఛార్జి బాధ్యతలను కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు అప్పగించినా.. సీఎం స్వయంగా ఎన్నికలను పర్యవేక్షించారు.

అభ్యర్థుల ఎంపికలో...

అభ్యర్థుల ఎంపికపై సర్వేలు నిర్వహించి, పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తీసుకున్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సానుకూలతలు ఉండడంతో ఆయనను సీఎం ముందే ఎంపిక చేశారు. హైదరాబాద్‌ స్థానంలో మొదట పోటీపై మీమాంస ఏర్పడింది. సర్వేల్లో పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు తేలడంతో ఆయన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కూతురు సురభివాణీదేవిని అనూహ్యంగా తెరపైకి తెచ్చారు. అనంతరం ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల బాధ్యతలను మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌లకు అప్పగించారు. దీంతో పాటు ఆరు ఉమ్మడి జిల్లాల్లోని మంత్రులు, నేతలతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు.

ఎమ్మెల్సీ స్థానాలు తెరాసకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించాలని, వాటిలో కచ్చితంగా విజయం సాధించాలని, మంత్రుల నుంచి కార్యకర్తల స్థాయి వరకు ప్రతి ఒక్కరు పట్టుదలతో పనిచేయాలని చెప్పారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమావేశాలు, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. ఓటర్లతో ముఖాముఖిలో పాల్గొన్నారు. పార్టీశ్రేణులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడంతో పాటు పట్టభద్రులతోనూ ఫోన్‌లో మాట్లాడారు. మంత్రులు హరీశ్‌రావు, కమలాకర్‌, ప్రశాంత్‌రెడ్డి తాము ఇన్‌ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో విస్తృతస్థాయి సభలు, సమావేశాలు నిర్వహించారు.

ఉద్యోగులకు సానుకూల సంకేతాలిచ్చి..

పీఆర్‌సీలో జాప్యం తదితర కారణాల వల్ల ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఈ ప్రభావం దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాల్లో పడిందన్న భావనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగులకు సానుకూల సంకేతాలు ఇచ్చారు. వారితో భేటీ అయ్యారు. సమస్యలపై స్పందించి, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగవర్గాల్లోనూ కొంత అనుకూలత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనిని మంత్రులు హరీశ్‌, కమలాకర్‌, ప్రశాంత్‌రెడ్డిలు అందిపుచ్చుకొని ఉద్యోగ, ఉపాధ్యాయ, అధికారుల సంఘాల మద్దతును సమీకరించారు. అనేక సంఘాలు తమ నిర్ణయాలను మంత్రుల సమక్షంలో బహిరంగంగా వెల్లడించాయి. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

ఇక దూకుడే..

రెండు ఎమ్మెల్సీ స్థానాల విజయాలు తెరాసకు నూతనోత్తేజాన్నిచ్చాయి. ఈ ఉత్సాహంతో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే అక్కడ పెద్దఎత్తున ఎన్నికల ప్రచారం సాగుతోంది. మరోవైపు వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలకు సైతం పార్టీ సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఆయా జిల్లాల నేతలకు సంకేతాలు ఇచ్చింది.

ఇవీచూడండి: గులాబీకే పట్టం కట్టిన పట్టభద్రులు... రెండు చోట్లా జయకేతనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.