ETV Bharat / city

CM KCR Delhi Tour: ముగిసిన సీఎం దిల్లీ పర్యటన.. ఐదు రోజుల్లో పాల్గొన్న సమావేశాలివే..!

ఐదు రోజులు దిల్లీ పర్యటన ముగించుకుని సీఎం కేసీఆర్​... హైదరాబాద్​ చేరుకున్నారు. కేంద్ర మంత్రులు అమిత్​షా, గజేంద్రసింగ్​ షెకావత్​, పీయూష్​ గోయల్​తో కేసీఆర్​ సమావేశమయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. అన్ని సమావేశాలు ముగించుకుని తిరిగి హైదరాబాద్​కు చేరుకున్నారు.

cm kcr completed delhi tour after five days meetings

author img

By

Published : Sep 28, 2021, 6:49 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్... ఐదు రోజుల దిల్లీ పర్యటన ముగిసింది. శుక్రవారం దిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్... కేంద్ర హోం శాఖ సమావేశంలో పాల్గొనడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఐదు రోజుల పర్యటన ముగించుకుని.. ఈరోజు మధ్యాహ్నం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్​కు సీఎం కేసీఆర్​ చేరుకున్నారు.

గజేంద్రసింగ్ షెకావత్​తో భేటీ..

శనివారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్​ను కలిశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై 40 నిమిషాల పాటు చర్చించారు. రాయలసీమ ఎత్తిపోతలతో పాలమూరుకు జరుగుతున్న నష్టాన్ని కేంద్రమంత్రికి సీఎం వివరించారు. తెలుగురాష్ట్రాల కృష్ణాజలాల వివాదంపై చర్చించారు. పాలమూరు- రంగారెడ్డికి అనుమతులు, నీటి కేటాయింపులు చేయాలని షెకావత్​ను సీఎం కేసీఆర్ కోరారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ గెజిట్ అమలు తేదీ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులనే నోటిఫికేషన్ పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు ప్రజాప్రతినిధులతో కలిసి షెకావత్‌ను సీఎం కలిశారు.

cm kcr completed delhi tour after five days meetings
కేంద్రమంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​తో కేసీఆర్​

​షాతో రెండు రోజుల సుధీర్ఘ భేటీ...

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఆదివారం నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆది, సోమవారాల్లో అమిత్ షాతో సీఎం కేసీఆర్​... మళ్లీ విడిగా కూడా భేటీ అయ్యారు. సమావేశం తర్వాత.. నార్త్‌బ్లాక్‌లోకి వెళ్లి హోంమంత్రి అమిత్‌ షాతో కేసీఆర్​ ఏకాంతంగా సమావేశమయ్యారు. సుమారు రెండు గంటల పాటు వారి మధ్య భేటీ కొనసాగింది. ఐతే ఏయే అంశాలపై చర్చించారనే విషయం తెలియరాలేదు. ఆదివారం రాత్రి కూడా అమిత్‌ షాను ఆయన నివాసంలో సీఎం కలిశారు. గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం, భాజపాలోనూ కీలక శక్తిగా ఉన్న అమిత్‌షాతో వరుసగా రెండు రోజులపాటు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ అంశాలపై ఇరువురి మధ్య కీలకచర్చ జరిగినట్లు సమాచారం.

పీయూష్​తోనూ రెండు రోజుల భేటీ..

కేంద్ర వాణిజ్య, ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్​తోనూ ముఖ్యమంత్రి శని, ఆదివారాల్లో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై పీయూష్ గోయల్​తో కేసీఆర్ చర్చించారు. రాష్ట్రంలో భారీగా వరి సాగు చేస్తున్న నేపథ్యంలో ఎఫ్​సీఐ ద్వారా బియ్యం కొనుగోళ్లు, నిల్వలు అధికంగా ఉన్న నేపథ్యంలో విదేశాలకు ఎగుమతులు లాంటి అంశాలపై కేంద్రమంత్రితో చర్చించారు. దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణపై మంత్రుల బృందం అధ్యయనం చేస్తోందని... మూడు నాలుగు రోజుల్లో సమాచారం ఇస్తామని పీయూష్‌ గోయల్‌ తెలిపినట్లు సమాచారం.

కేంద్రమంత్రి పీయూష్​గోయల్​తో సీఎం కేసీఆర్​

పలువురు కేంద్ర మంత్రులతో భేటీలు ముగించుకున్న కేసీఆర్​... ప్రత్యేక విమానంలో హైదరాబాద్​కు తిరుగు ప్రయాణమై వచ్చారు.

సంబంధిత కథనాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.