ETV Bharat / city

క్రమశిక్షణతో ఎదుర్కొందాం.. లేకుంటే భారీ మూల్యం: ఏపీ సీఎం జగన్ - మీడియా సమావేశం

కరోనా వ్యాప్తిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి విపత్కర సమయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్రులకు ఎలాంటి కష్టం రానీయకుండా చూసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు జగన్.

cm-jagan-on-corona-effect-in-andhrapradesh
'క్రమశిక్షణతో ఎదుర్కొందాం... లేకుంటే తప్పదు మూల్యం'
author img

By

Published : Mar 26, 2020, 7:35 PM IST

Updated : Mar 27, 2020, 12:19 AM IST

కరోనా లాంటి అంటువ్యాధులు వచ్చినప్పుడు క్రమశిక్షణతో ఉంటేనే సమర్ధంగా ఎదుర్కోగలమని... లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అందుకే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు.

ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోండి

సరిహద్దుల వద్ద జరిగిన సంఘటనలు తనను కలచివేశాయని... కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఏం చేయలేరన్నారు. ఎక్కడ ఉన్న వాళ్లు అక్కడే ఉండిపోతే అందరికీ మంచిదని జగన్​ విజ్ఞప్తి చేశారు. కరోనాను కట్టడి చేయాలంటే... ఏప్రిల్‌ 14 వరకు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. లేకుంటే కరోనా ఎప్పటికీ సమసిపోని సమస్యగా మిగిలిపోతుందన్నారు. మనమంతా జాగ్రత్తగా ఉంటే వైరస్‌ వ్యాప్తిని నివారించవచ్చన్నారు జగన్. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారందరినీ ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని విజ్ఞప్తి చేశారు.

'కేసీఆర్‌ భరోసా ఇచ్చారు'

తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వాళ్లకు కష్టం రానీయకుండా చూసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారని జగన్ తెలిపారు.

ఏపీలో 10 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో ప్రస్తుతం 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపిన ఏపీ సీఎం... ఇది ఏ పరిస్థితికి దారి తీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. 27,819 మంది ఇటీవల విదేశాల నుంచి ఏపీకి వచ్చారని వీళ్లందరూ అధికారుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు.

విధుల్లో ఉన్న వారికి అభినందనలు

ఏపీలో ఇంటింటికీ సేవలు అందిస్తున్న వాలంటీర్లు, ఆశా వర్కర్లను ఏపీ సీఎం అభినందించారు. వీళ్లందరూ నిబద్ధతతో పని చేస్తున్నందునే 10 కేసులకే పరిమితమయ్యామని వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తిపై మరింత దీటుగా పోరాడేందుకు 4 చోట్ల క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 4,500 ఐసీయూ ‌పడకలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా రోగుల కోసం ఏపీలోని ప్రతి జిల్లాలో 200 పడకలు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో చికిత్స కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 213 ఐసీయూ బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయన్నారు.

సమస్య ఏదైనా.. 1902కి కాల్‌ చేయండి

ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఎవరికి వారు బాధ్యత తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి సూచించారు. ఎవరికి సమస్య ఉన్నా 1902కు ఫోన్‌ చేయాలని.. ఆరోగ్య సమస్యలు మినహా ఎలాంటి ఇబ్బందులున్నా.. చెప్పవచ్చన్నారు. ఆరోగ్య సమస్యలకు సంబంధించి 104కు ఫోన్ చేసి చెప్పాలని తెలిపారు.

రీ సర్వే...

కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై రెండోసారి సర్వే చేయాలని నిర్ణయించినట్టు ఏపీ ముఖ్యమంత్రి చెప్పారు. ఈసారి సర్వేలో గ్రామ వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి వస్తారన్నారు. జలుబు గానీ, జ్వరం గానీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గానీ ఉంటే వెంటనే గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది మ్యాపింగ్‌ చేసి వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు ముఖ్యమంత్రి.

నిత్యావసరాల కొరత లేదు

నిత్యావసర వస్తువులకు కొరత రానివ్వబోమని, అవసరం మేరకు నిల్వలు ఉన్నాయని ఏపీ సీఎం జగన్​ భరోసా ఇచ్చారు. హడావుడి పడి గుంపులు గుంపులుగా వచ్చి సరుకులు కొనే ప్రయత్నం చేయొద్దని సూచించారు.

రైతులకు, రైతు కూలీలకు విజ్ఞప్తి

జాగ్రత్తలు పాటించి పొలం పనులు చేసుకోవాలని రైతులకు సూచించారు. మనిషికి మనిషికి మధ్య దూరం ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు.

క్రమశిక్షణతో ఎదుర్కోకుంటే మూల్యం తప్పదు

ఇవీచూడండి: కరోనాపై సీఎం కేసీఆర్​ సమీక్ష

Last Updated : Mar 27, 2020, 12:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.