ఏపీలోని విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మంప పీఎస్ పరిధిలో ఎదురుకాల్పులు కలకలం సృష్టించాయి. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టులు ఉన్నారన్న సమచారంతో మంప పీఎస్ పరిధిలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
ఎవరు చనిపోయారు.. ఎంత మంది గాయపడ్డారో తెలియాల్సి ఉందని కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వివరాలు తెలియడానికి సమయం పడుతుందని వివరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. ఘటనాస్థలికి పోలీసులు అదనపు బలగాలను తరలిస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: Delta Variant: డెల్టా వైరస్ రెండు నెలల్లో ఎలాగైనా మారొచ్చు!