ETV Bharat / city

గులాబీనేతల్లో గుప్పుమన్న విభేదాలు.. 'కబ్జా' ఆరోపణల వెనకున్న కమామిషేంటీ..? - మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి

Sabitha Indra reddy vs Theegala Krishna Reddy: మహేశ్వరం నియోజకవర్గంలో తెరాస నేతల మధ్య విబేధాలు బహిరంగమయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకొని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే బడంగపేట మేయర్ కాంగ్రెస్​లో చేరిన సందర్భంలో తీగల వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తీగల కృష్ణారెడ్డి త్వరలో పార్టీని వీడతారన్న ప్రచారం తెరపైకి రాగా.. అలాంటిదేమీ లేదని ఆయన కొట్టిపడేశారు. ఆచితూచి వ్యవహరిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. త్వరలో కేసీఆర్, కేటీఆర్​తో చర్చించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Clash between TRS Leaders Sabitha Indra reddy and Theegala Krishna Reddy

author img

By

Published : Jul 5, 2022, 9:56 PM IST

Sabitha Indra reddy vs Theegala Krishna Reddy: మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇప్పటికే ఇద్దరు నేతల అభిమానులు వర్గాలుగా చీలిపోగా.. వారి మధ్య అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతున్నాయి. అయితే.. ఇన్ని రోజులు లోలోపలే నడిచిన అధిపత్య రాజకీయం.. ఇప్పుడు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి మధ్య కొంతకాలంగా విబేధాలు కనిపిస్తున్నాయి. సబితా ఇంద్రారెడ్డి తెరాసలో చేరినప్పటి నుంచి తీగల కృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగానే ఉంటున్నారు. పార్టీలో చేర్చుకోవటమే కాకుండా మంత్రి పదవి కూడా కట్టబెట్టటంపై.. అధిష్ఠానంపై కృష్ణారెడ్డి గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టు ఉండటం.. నియోజకవర్గంలోని కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోవటం.. ఇవన్నీ పరిణామాలతో కృష్ణారెడ్డి పార్టీ మారుతారనే సంకేతాలు బలంగా వచ్చాయి. అయితే.. కాంగ్రెస్​లో చేరుతారని కొన్ని రోజులు.. భాజపాలో చేరతారని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలపై స్పందిస్తూ.. తాను పార్టీ మారడం లేదని తీగల కృష్ణారెడ్డి పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇన్ని రోజులు సబితా ఇంద్రారెడ్డిపై ఉన్న అసమ్మతిని ఆయన ఇప్పుడు బహిరంగగానే వెలిబుచ్చారు. నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. సంచలన ఆరోపణలు చేశారు. తీగల కృష్ణారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెరాసలో చర్చనీయాంశమయ్యాయి.

"మీర్‌పేట్‌ను సబితా ఇంద్రారెడ్డి నాశనం చేస్తున్నారు. మీర్‌పేట నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోను. మా ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తా. సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు. చెరువులు, పాఠశాలల స్థలాలను కూడా వదలడం లేదు. తమ పార్టీ నుంచి మంత్రి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదు. అందుకే అభివృద్ధిని గాలికొదిలేశారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తిచేయలేదు. మంత్రి సబిత వైఖరిపై సీఎంతో మాట్లాడతా." - తీగల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే

అయితే తీగల కృష్ణారెడ్డి వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి ఆచితూచి స్పందించారు. ఇది చిన్న విషయమని సున్నితంగా కొట్టిపారేశారు. తీగల కృష్ణారెడ్డితో మాట్లాడి పరిష్కరింటానని... ఆయనను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో తెలుసుకుంటానని దాటవేశారు.

"మేం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటాం. ఏ విషయంలో.. ఎవరు కృష్ణారెడ్డిని తప్పుదోవ పట్టించారో తెలియదు. ఒకవేళ నిజంగానే కబ్జాలు జరిగి ఉంటే.. ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఎప్పటికీ కబ్జాలను ప్రోత్సహించదు. కృష్ణన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థంకాలేదు. ఈ విషయాన్ని మేం కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించకుంటాం. ఇది పెద్ద విషయమేమి కాదు." -సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి

మహేశ్వరం నుంచి 2014లో తెదేపా నుంచి ఎన్నికైన తీగల కృష్ణారెడ్డి తర్వాత తెరాసలో చేరారు. తెరాస తరఫున 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి గెలిచి తెరాసలో చేరిన సబితా ఇంద్రారెడ్డి మంత్రి కావడంతో నియోజకవర్గంలో పార్టీ కేడర్​లో కొంత గందరగోళం ఏర్పడింది. కాంగ్రెస్ నుంచి తనతో పాటు తెరాసలోకి వచ్చిన వారికే సబితా ఇంద్రారెడ్డి ప్రాధాన్యమిస్తున్నారు కానీ.. ఉద్యమకారులను, మొదట్నుంచీ తెరాసలో ఉన్నవారికి ప్రాధాన్యమివ్వడం లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తీగల కృష్ణారెడ్డి కూడా పార్టీలో అంతంత మాత్రంగానే ఉంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి నియోజవర్గం పరిధిలోని రెండు డివిజన్లనూ భాజపా కైవసం చేసుకుంది. బడంగపేట్ కార్పొరేషన్ మేయర్ పారిజాతరెడ్డి నిన్ననే మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో తీగల కృష్ణారెడ్డి తాజా వ్యాఖ్యలు పార్టీలో దుమారం లేపుతున్నాయి. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న సబితా ఇంద్రెడ్డి క్షేత్రస్థాయి పరిస్థితులను కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో సబితా ఇంద్రెరాడ్డి, తీగల కృష్ణారెడ్డితో చర్చించాలని తెరాస అగ్రనేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.