ETV Bharat / city

CJI NV RAMANA TOUR: ఈనెల 24 నుంచి స్వరాష్ట్రంలో పర్యటించనున్న సీజేఐ

CJI NV RAMANA TOUR: ఈనెల 24నుంచి నాలుగు రోజులపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీజేఐ టూర్ షెడ్యూల్​ను అధికారులు ప్రకటించారు.

CJI NV RAMANA tour in andhra pradesh
CJI NV RAMANA tour in andhra pradesh
author img

By

Published : Dec 23, 2021, 8:00 PM IST

Updated : Dec 23, 2021, 8:17 PM IST

CJI NV RAMANA TOUR: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. నాలుగు రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. ఈనెల 24 నుంచి 27వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామం పొన్నవరానికి రానున్నారు. దీంతో పొన్నవరంలో సందడి నెలకొంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీజేఐ టూర్ షెడ్యూల్ ఇలా ఉంది..

24వ తేదీన..

ఈనెల 24న ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్​ నుంచి సూర్యాపేట మీదుగా పొన్నవరం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పొన్నవరంలో భోజనం చేయనున్నారు. అనంతరం పొన్నవరం నుంచి విజయవాడ నోవాటెల్​కు చేరుకుంటారు. సాయంత్రం 4.30కు నోవాటెల్ నుంచి గుంటూరుకు చేరుకుంటారు. అనంతరం గుంటూరు నుంచి చందోలు గ్రామం, ఆ తరువాత పెదనందిపాడులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి కలవనున్నారు. అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు విజయవాడ నోవాటెల్​కు తిరిగి రానున్నారు.

25వ తేదీన..

25న ఉదయం 8.30 నుంచి 9.30 వరకు అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం నోవాటెల్​కు చేరుకొని విజిటర్లతో మాట్లాడతారు. సాయంత్రం 4.45కు ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రభుత్వం ఇచ్చే హైటీలో పాల్గొంటారు. అక్కడ నుంచి సాయంత్రం 6 గంటలకు సిద్ధార్ద అకాడమీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు హైకోర్టు సీజే ఆధ్వరంలో ఇచ్చే విందు కార్యక్రమంలో పాల్గొంటారు.

26వ తేదీన..

26న ఉదయం 9.30 గంటలకు కానూరు సిద్ధార్ధ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 11 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో జరిగే న్యాయాధికారుల సదస్సుకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హైకోర్టు ప్రాంగణంలో హైకోర్టు బార్ అసోసియేషన్, ఏపీ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం గవర్నర్ ఇచ్చే హైటీకి హాజరుకానున్నారు. అక్కడి నుంచి బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటుపల్లిలో జరిగే ఫెలిసిటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.

27వ తేదీన..

సమయాభావం ఆధారంగా 27న ఉదయం 7 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి కంచికర్ల, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ చేరుకుంటారని.. సీజేఐ టూర్ షెడ్యూల్​లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

Last Updated : Dec 23, 2021, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.