తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతోందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో షాదీ ముబారక్ ,కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలకు చెందిన 89 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు పరచడం లేదని ఎమ్మెల్యే అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఈ సంక్షేమ పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని.. ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు.
ఇదీ చూడండి: క్రీడా పాలసీపై సబ్ కమిటీ: మంత్రి శ్రీనివాస్ గౌడ్