ETV Bharat / city

అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ ఆక్సిజన్ సరఫరాపై లేదు: చంద్రబాబు

author img

By

Published : May 11, 2021, 12:03 AM IST

ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆస్పత్రిలో రోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజుల వ్యవధిలోనే దాదాపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అసమర్థ పాలనకు నిదర్శమనని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ ఆక్సిజన్ సరఫరాపై లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

chandrababu
అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ ఆక్సిజన్ సరఫరాపై లేదు: చంద్రబాబు

ఏపీలోని తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందడం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ ఆక్సిజన్ సరఫరాపై లేదని దుయ్యబట్టారు. 10 రోజుల వ్యవధిలో ఆక్సిజన్ అందక 30 మంది ప్రాణాలు పోతే ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. వరుస ఘటనలు చోటుచేసుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.

ప్రజల ప్రాణాలు పోతుంటే లెక్కలేకుండా శవాల దిబ్బపై రాజ్యామేలాలనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. వెంటనే మొద్దునిద్ర వీడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధప్రాతికన ఆక్సిజన్ అందించి కొవిడ్ రోగులను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: తిరుపతిలో విషాదం.. రుయా ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక 11 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.