ETV Bharat / city

'అద్భుత రాజధాని అవకాశాన్ని ప్రభుత్వం దూరం చేసింది'

ఏపీలో అమరావతి నిర్మాణం నిలిపివేయడం ఒక జాతీయ విషాదం అని తెదేపా అధినేత చంద్రబాబు అభివర్ణించారు. మూడు రాజధానుల ఏర్పాటు అనేది తుగ్లక్‌ నిర్ణయమన్న ఆయన.. అద్భుత రాజధాన్ని నిర్మించుకునే అవకాశాన్ని వైకాపా ప్రభుత్వం దూరం చేసిందని మండిపడ్డారు. అమరావతి రైతులు 200 రోజులుగా చేస్తోన్న పోరాటం స్ఫూర్తిదాయకమని తెలిపారు.

chandrababu naidu comments on capital city amaravati andhra pradesh
అద్భుత రాజధాని అవకాశాన్ని ప్రభుత్వం దూరం చేసింది
author img

By

Published : Jul 4, 2020, 2:46 PM IST

విభజన బాధల నుంచి పుట్టిన ఆలోచనే అమరావతి అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రైతులు 200 రోజులుగా చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. రైతుల స్ఫూర్తికి తాను వందనం చేస్తున్నానంటూ.. ఈ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం నిలిపివేయడం ఒక జాతీయ విషాదం అని చంద్రబాబు అభివర్ణించారు.

మూడు రాజధానుల ఏర్పాటు అనేది తుగ్లక్‌ నిర్ణయమన్న చంద్రబాబు.. అద్భుత రాజధాన్ని నిర్మించుకునే అవకాశాన్ని వైకాపా ప్రభుత్వం దూరం చేసిందని మండిపడ్డారు. ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణం పూర్తయితే రాష్ట్ర పురోభివృద్ధికి బలమైన చోదకశక్తిగా నిలిచేదని పేర్కొన్నారు. సీఎం జగన్‌ సొంత ప్రయోజనాల కోసమే 3 రాజధానుల ఆలోచన అని చంద్రబాబు ఆరోపించారు.

ఇదీ చదవండి: గ్రేటర్​లో విజృంభణ.. రికార్డు స్థాయిలో 1658 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.